వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమ్ యాప్ సంచలనం: 10రోజుల్లో.. 10మిలియన్ డౌన్‌లోడ్స్..

పదిరోజుల్లోనే 10మిలియన్ పైన 'భీమ్' యాప్ డౌన్ లోడ్లు జరిగాయంటే.. ఈ యాప్ కు డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన 'భీమ్' యాప్ సామాన్యులకు చేరవుతోంది. ఈ క్రమంలో అత్యధిక మంది ప్రజలు భీమ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. పదిరోజుల్లోనే 10మిలియన్ పైన 'భీమ్' యాప్ డౌన్ లోడ్లు జరిగాయంటే.. ఈ యాప్ కు డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

దీనిపై స్పందించిన మోడీ.. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు ఏవిధంగా అలవాటుపడుతున్నారు అనేదానికి ఇదొక నిదర్శనమన్నారు. ప్రజలు సాంకేతికతను ఎలా అందిపుచ్చుకుంటారో దీని ద్వారా తెలుస్తోందని, మేక్ ఇన్ ఇండియాకు ఇదొక చక్కని ఉదాహరణ అని అన్నారు.

Digital transactions mobile app BHIM downloaded 10 million times: PM Narendra Modi

నగదు రహిత లావాదేవీలకు భీమ్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, యువతకు, వ్యాపారులకు ఇది చాలా ఉపకరిస్తుందని పీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, భీమ్-భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ అనే ఆండ్రాయిడ్ యాప్ ను ప్రధాని మోడీ పదిరోజుల క్రితం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ భీమ్ యాప్ ఆంగ్ల, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని దిగుమతి చేసుకోవచ్చు. భీమ్ యాప్ ద్వారా లావాదేవీలు నిర్వహించడం ద్వారా ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదన్నారు. ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానంతో ఎవరైనా ఈ భీమ్ యాప్ ను ఉపయోగించుకోవచ్చు. గణతంత్ర దినోత్సవాల్లో ఈ ఏడాది భీమ్ యాప్ ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
Prime Minister Narendra Modi on Monday disclosed that the recently launched BHIM (Bharat Interface for Money) mobile application has recorded 10 million downloads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X