పోటీ పడండి, విలీనానికి కెసిఆర్ సానుకూలం: దిగ్విజయ్

అనంతరం డిగ్గీ మాట్లాడారు. త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. సోనియాతో భేటీ సమయంలో విలీనంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్చించారని, విలీనం విషయంలో తదుపరి అంశాలపై చర్చించవలసి ఉందన్నారు. సోనియాతో భేటీ సమయంలో విలీనంపై సానుకూలంగా స్పందించారన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు రెండు వేర్వేరు పిసిసిలు, ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
కాంగ్రెసు పార్టీ తన వాగ్ధానాలను నిలబెట్టుకుంద్నారు. మార్చిలో సీమాంధ్రలో బహిరంగ సభలు ఉంటాయని, సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొంటారన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల ప్రతిపత్తి, పదేళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సోనియాకు, రాహుల్‌కు, కాంగ్రెసుకు కెసిఆర్ కృతజ్ఢతలు చెప్పడం సంతోషకరమన్నారు.
మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ.. సీమాంధ్ర సమస్యలను తాము సోనియాకు వివరించామని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సోనియా గాంధీ అందుకు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
మరోవైపు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి పికె మహంతి బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేతో పాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్ర హోంశాఖతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర సూచనలు,ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ నుంచి వచ్చాక సిఎస్ మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications