జగన్ నా కొడుకులాంటి వాడు: దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన కుమారుడి లాంటివాడని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. జగన్‌ది తమ పార్టీ డిఎన్ఎనే అని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యపై జగన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. దిగ్విజయ్ సింగ్‌ను లాగి చెంపపై కొట్టండని జగన్ వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్డిఎకు పాత మిత్రుడేనని దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ బిల్లుపై ఎప్పుడు చర్చించాలనేది ఆంధ్రప్రదేశ్ శాసనసభ సలహా సంప్రదింపుల కమిటీ (బిఎసి) నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. బిల్లు ప్రతులను చించేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శానససభలో తెలంగాణ బిల్లుపై చర్చ సజావుగా సాగుతుందని భావిస్తున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications