దిలీప్ మేనేజర్ మాయం: పల్సర్ సునీకి ఎంత డబ్బు, నేరుగా హీరోను ఎవరు కలిశారు, ఫోన్లు ?

మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి మాయం కావడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి తమిళనాడు పారిపోయి ఉంటాడని కేరళ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొచ్చి: మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి మాయం కావడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి తమిళనాడు పారిపోయి ఉంటాడని కేరళ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దిలీప్ ను అతని మేనేజర్ అప్పుణ్ణి ఎక్కడ ఉన్నాడు ? అని ప్రశ్నిస్తున్నారు.

హీరో దిలీప్ కు నో బెయిల్, మళ్లీ పోలీసు కస్టడీ, త్రిశూర్ లో ఇద్దరినీ విచారణ, ఇక అంతేనా !

మలయాళం హీరో దిలీప్ సినిమాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, నగదు లావాదేవీల మొత్తం ఆయన మేనేజన్ అప్పుణ్ణి చూసుకుంటున్నారు. నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసు విషయంలో అరెస్టు అయిన పల్సర్ సునీ ఇప్పటికే దిలీప్ పేరు బయటపెట్టారు.

రూ. 1.50 కోట్లు డీల్ !

రూ. 1.50 కోట్లు డీల్ !

నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేస్తే పల్సర్ సునీకి రూ. 1.50 కోట్లు ఇస్తానని హీరో దిలీప్ ఒప్పందం చేసుకున్నాడని ఇప్పటికే కేరళ పోలీసులు చెప్పారు. అయితే నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన పల్సర్ సునీకి ఇంత వరకు రూ.1.50 కోట్లు చేరలేదని పోలీసులు అంటున్నారు.

Recommended Video

    Man held for raping and impregnating Madhapur teenage girl
    దిలీప్ నుంచి డబ్బులు !

    దిలీప్ నుంచి డబ్బులు !

    పల్సర్ సునీకి దిలీప్ నుంచి ఎంత మొత్తంలో నగదు చేరింది ? అనే విషయం కచ్చితంగా వెలుగు చూడాలంటే ఆయన మేనేజర్ అప్పుణ్ణి చిక్కాలని పోలీసులు అంటున్నారు. అప్పుణ్ణికి తెలీకుండా ఇప్పటి వరకు దిలీప్ ఎలాంటి వ్యవహారాలు చెయ్యలేదని సమాచారం.

    ఎక్కడ ఉన్నాడు ?

    ఎక్కడ ఉన్నాడు ?

    హీరో దిలీప్ అరెస్టు అయిన తరువాత ఆయన మేనేజర్ అప్పుణ్ణి మాయం అయ్యాడా ? లేక దిలీప్ ను విచారణ చేస్తున్న సమయంలోనే పారిపోయాడా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద హీరో దిలీప్ పల్సర్ సునీ, అతని అనుచరులకు ఎంత డబ్బు ఇచ్చాడు ? అని వివరాలు సేకరిస్తున్నారు.

    దిలీప్ ను ఎవరు కలిశారు ?

    దిలీప్ ను ఎవరు కలిశారు ?

    నటిపై లైంగిక దాడి జరిగిన రోజు (ఫిబ్రవరి 17వ తేదీ)కు ముందు ఆ తరువాత ఎంత మంది హీరో దిలీప్ ను కలిశారు ? ఎవరెవరు ఫోన్లు చేశారు ? ఏం మాట్లాడారు అని పూర్తి వివరాలు వెలుగు చూడాలంటే అప్పుణ్ణి చిక్కాలి. దిలీప్ ఫోన్ నెంబర్ తో సహ అప్పుణ్ణి మొబైల్ డేటాను పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు.

    నేరుగా ఎవరైనా వచ్చారా ?

    నేరుగా ఎవరైనా వచ్చారా ?

    నటి కిడ్నాప్, లైంగిక దాడి జరిగిన తరువాత కొత్త వ్యక్తులు ఎవరైనా దిలీప్ ను కలవడానికి నేరుగా వచ్చారా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దిలీప్ మేనేజర్ చిక్కితేనే నటి లైంగిక దాడి కేసు దాదాపు కొలక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు చేస్తున్న ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+