దిలీప్ కుమార్: ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు - Newsreel

ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ముంబయిలోని హిందూజా హాస్పిటల్లో చేర్చారు.
ఉదయం 8.30 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన సన్నిహితుడు బషీర్ కొలంబోవాలా బీబీసీకి తెలిపారు.
"ఆయనకు ఊపిరి సరిగా అందకపోవడంతో ఆస్పత్రిలో చేర్పించాం. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదు. ఆయన వయసు రీత్యా రిస్క్ తీసుకోకూడదని వెంటనే ఆస్పత్రిలో చేర్చాం" అని బషీర్ తెలిపారు.
గత కొన్ని రోజులుగా దిలీప్ కుమార్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన భార్య సైరాబాను తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
https://twitter.com/ANI/status/1401397058062323716
హిందూజా హాస్పిటల్ ఖార్‌లో డాక్టర్ నితిన్ గోఖలే బృందం దిలీప్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications