శశికళ స్కెచ్: టీటీవీ దినకరన్ పక్కాప్లాన్: ఆరోజు హెడ్ ఆఫీస్ లోకి, జిల్లా నాయకులకు పిలుపు !
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) బహిష్కరించిన టీటీవీ దినకరన్ మరోసారి చర్చకు కారణం అయ్యారు. పార్టీ నుంచి బహిష్కరించినా ఆయన ఆగస్టు 5వ తేదిన సమావేశానికి హాజరు కావాలని తమిళనాడులోని అన్ని జిల్లాల అన్నాడీఎంకే నాయక
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) బహిష్కరించిన టీటీవీ దినకరన్ మరోసారి చర్చకు కారణం అయ్యారు. పార్టీ నుంచి బహిష్కరించినా ఆయన ఆగస్టు 5వ తేదిన సమావేశానికి హాజరు కావాలని తమిళనాడులోని అన్ని జిల్లాల అన్నాడీఎంకే నాయకులకు పిలుపునిచ్చారు.
ఆగస్టు 5వ తేదిన చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో తమిళనాడులోని అన్ని జిల్లాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ హాజరుకావాలని సోమవారం టీటీవీ దినకరన్ పిలుపునివ్వడంతో ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది.

టీటీవీ దినకరన్ ను ఎలా కట్టడి చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆయన మంత్రి వర్గంలోని కొందరు నేతలు ఆలోచిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగే రోజు అన్నాడీఎంకే నాయకులతో దినకరన్ సమావేశం ఏర్పాటు చెయ్యడంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిజీగా ఉన్న సమయంలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టాలని టీటీవీ దినకరన్ ప్రయత్నాలు ముమ్మరం చెయ్యడంతో ఇప్పుడు మరోసారి రచ్చరచ్చ అయ్యే అవకాశం ఉందని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications