గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో దినకరన్ గ్రూప్ 19 మంది ఎమ్మెల్యేలు భేటీ, టెన్షన్ టెన్షన్ !
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం చెన్నైలోని రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ తో భేటీ అయ్యారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం చెన్నైలోని రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ తో భేటీ అయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, సోమవారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా గవర్నర్ విద్యాసాగర్ రావ్ కు ఫిర్యాదు చెయ్యడానికి టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వెళ్లారని తెలిసింది. దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో చర్చలు జరుపుతున్నారు.

అవసరం అయితే తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి టీటీవీ దినకరన్ సిద్దం అయ్యారని తెలిసింది. టీటీవీ దినకరన్ వర్గంలో సోమవారం వరకు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మంగళవారం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ వర్గంలో చేరిపోవడంతో తమిళనాడు ప్రభుత్వంలో టెన్షన్ మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications