Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీటీవీ దినకరన్ కు కాలిపోయింది, జైల్లో శశికళకు చెప్పాలని చలో బెంగళూరు !

తమిళనాడులో రోజురోజుకు మారుతున్న రాజకీయాలు చూసి జీర్ణించుకోలేకపోతున్న టీటీవీ దినకరన్ ఇక లాభం లేదని, చిన్నమ్మకు ఫిర్యాదు చేసి ఆమె దగ్గర సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు.

చెన్నై: తమిళనాడులో రోజురోజుకు మారుతున్న రాజకీయాలు చూసి జీర్ణించుకోలేకపోతున్న టీటీవీ దినకరన్ ఇక లాభం లేదని, చిన్నమ్మకు ఫిర్యాదు చేసి ఆమె దగ్గర సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. గురువారం టీటీవీ దినకరన్ చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరారు.

దినకరన్ వెంట ఆయన అనుచరులు, కొందరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. దినకరన్ మా కాళ్లు పట్టుకుంటే అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాని కార్యదర్శి పదవి ఇచ్చామని తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Dinakaran leaves Bangalore to meet Sasikala at Parappana Agrahara jail.

మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, జయకుమార్, ఆర్ బి. ఉదయ్ కుమార్, సెంగోట్టయన్ దినకరన్ మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. శశికళకు ముఖ్య అనుచరులుగా ఉన్న మంత్రులు ఒక్క సారిగా దినకరన్ మీద ముప్పేట దాడి చెయ్యడంతో దినకరన్ జీర్ణించుకోలేకపోతున్నారు.

మంత్రుల విషయం, తన పదవి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించిన టీటీవీ దినకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళతో భేటీ కావడానికి బయలుదేరారు. గురువారం సాయంత్రం దినకరన్ శశికళతో భేటీ అయ్యే అవకాశం ఉంది. శశికళతో భేటీ అయిన తరువాత దినకరన్ ఎలా స్పంధిస్తారో అంటూ పళనిసామి వర్గం ఎదురు చూస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+