సినిమా ఛాన్స్ కోసం వెళితే.. ఆ దర్శకుడు ఏం చేశాడంటే..
సినిమాలో ఛాన్స్ కోసం వెళ్లిన ఓ కళాశాల అమ్మాయిని తన లైంగిక కోరిక తీరిస్తే.. సినిమా ఛాన్స్ ఇస్తానంటూ ఓ సినీ దర్భకుడు ఒత్తిడి చేసిన ఘటన పూణే నగరంలో సంచలనం రేపింది.
పూణే : సినిమాలో ఛాన్స్ కోసం వెళ్లిన ఓ కళాశాల అమ్మాయిని తన లైంగిక కోరిక తీరిస్తే.. సినిమా ఛాన్స్ ఇస్తానంటూ ఓ సినీ దర్భకుడు ఒత్తిడి చేసిన ఘటన పూణే నగరంలో సంచలనం రేపింది. గత ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి పూణే నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుకుంటోంది. సెలవుల్లో తన స్వగ్రామమైన జెజూరీకి వచ్చిన అమ్మాయికి వాట్సాప్‌లో తాము కొత్తగా నిర్మించనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది.

దీంతో సినిమాలో నటించాలనే తన కలను నిజం చేసుకుందామని భావించిన ఆ విద్యార్థిని బ్యాగులో బట్టలు సర్దుకొని పూణే నగరానికి వచ్చింది. ఆడిషన్ కోసం కాలేవాడీలోని తప్కీర్ చౌక్ కు వెళ్లి సినీదర్శకుడు అప్పా పవార్‌ను కలిసింది.
ఇదే అదనుగా దర్శకుడు అప్పా పవార్ తన దుర్బుద్ధిని బయటపెట్టుకున్నాడు. ఆ యువతికి ఆడిషన్ చేయకుండానే తన లైంగిక కోరిక తీరిస్తే సినిమాల్లో నటించేందుకు పలు అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు.
అతడి మాటలతో షాక్ కు గురైన సదరు విద్యార్థిని భయంతో అక్కడినుంచి తిరిగి జెజూరీ గ్రామానికి వెళ్లిపోయింది. రెండు రోజుల తర్వాత తిరిగి పూణే వచ్చి సదరు సినీ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వాకాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టరు సంగీత చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications