మురికి మొగుడు.. స్నానం చేయడు, గడ్డం గీకడు..!ఎలా కాపురం చేయాలి..! విడాకులకు అప్లై చేసిన మహిళ..!!

భోపాల్‌/హైదరాబాద్ : కొన్ని మానవ బంధాలు ఎంత ద్రుఢంగా ఉంటాయో కొన్ని బంధాలు అంతే త్రుణప్రయాంగా ఉంటాయి. మంచినీళ్ల బాటిల్ కోసం కారు ఆపలేదనో, పానీ పూరీ తినిపించలేదనో, మొక్కజొన్న పొత్తు వేడిగా తేలేదనో విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో కట్టుకున్న మొగుడు నిత్యం మురికిగా ఉంటే ఎవరు భరిస్తారు చెప్పండి. ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య బంధాలకు విలువే లేకుండా పోయింది.

ఒకప్పుడు బలమైన కారణాలుంటేగానీ విడాకుల ప్రస్తావన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు చిన్న చిన్న కారణాలను చూపి విడిపోవాలని చూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ జంట విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తన భర్త కొన్ని రోజుల పాటు స్నానం చేయకుండా, గడ్డం గీసుకోకుండా ఉంటున్నారని ఓ మహిళ విడాకుల కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.

Dirty hubby..no bathing and shaving.!How do you want to be.?The woman who apply for divorce..!

ఇలాంటి అరుదైన సంఘటన పై విచారణ ప్రారంభించిన భోపాల్‌ ప్యామిలీ కోర్టు ఇద్దరినీ ఆరు నెలల పాటు విడిగా ఉండాలని తెలిపింది. అప్పుడే విడాకులు ఇవ్వగలమని స్పష్టం చేసింది. వీరిని కౌన్సెల్‌ చేసిన షెయిల్‌ అవస్థీ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని బరిగఢ్‌కు చెందిన ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన భర్త వరుసగా ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు స్నానం చేయడని దరఖాస్తులో పేర్కొంది.

దీంతో అతని నుంచి దుర్గంధం వస్తోందని, స్నానం చేయమని చెబితే పెర్‌ఫ్యూమ్‌తో సరిపెట్టుకుంటాడని తెలిపింది. అతని ప్రవర్తనతో విసిగి పోయిన ఆమె విడాకులు కావాలని కోరింది. దానికి భర్త కూడా సమ్మతించడంతో ఇద్దరూ కలిసి కోర్టును ఆశ్రయించారు. వీరిది కులాంతర వివాహం. అదీ పెద్దల అనుమతితో జరిగిన పెళ్లి కావడం గమనార్హం. మొత్తానికి మురికి మొగుడితో సంసారం మూణ్నాళ్లలో ముగిసినందుకు సదరు మహిళ ముసిమముసి నవ్వు నవ్వుకుంటుందట..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+