వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలోకి బప్పీ లహిరి? మమత పార్టీ ద్వారా మిథున్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు బప్పీ లహిరి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. సినిమా రంగంలో తన ప్రతిభ చాటుకున్న, 1980లలో మెగా హిట్స్ ఇచ్చిన బప్పీ లహిరి ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారట.

అతనిని అభిమానులు ముద్దుగా బప్పీ దా అని పిలుస్తుంటారు. ఈ బప్పీ దా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు కేంద్ర నాయకులను పార్టీలో చేరే విషయమై కలిసినట్లుగా తెలుస్తోంది. త్వరలో అధికారిక నిర్ణయం రానుందని చెబుతున్నారు.

 ‘Disco king’ Bappi Lahiri may join BJP

62 ఏళ్ల బప్పీ లహిరి సంగీత కుటుంబంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జన్మించారు. తనకు పంతొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ముంబైకి వచ్చారు. అతను చాలాకాలం పాటు సంగీత ప్రపంచాన్ని ఏలారు. ఎన్నో మెగా హిట్స్ ఇచ్చారు. ముఖ్యంగా 1980లలో మిథున్ చక్రవర్తి హీరోగా వచ్చిన డిస్కో డ్యాన్సర్ సూపర్ డూపర్ హిట్ అయింది. అతనికి ఎంతో పేరు తెచ్చింది.

మరోవైపు మిథున్ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెసు పార్టీ ద్వారా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిస్కో డ్యాన్సర్‌తో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు (మిథున్ చక్రవర్తి, బప్పీ లహిరి)లు ఒకే సమయంలో రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధమవుతుండటం గమనార్హం. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి ప్రముఖులను పార్టీలోకి తీసుకోవాలని చూస్తోంది.

English summary
Music director and singer Bappi Lahiri seems to be planning a new career beyond the film industry. The "disco king", known for his mega hits in the 1980s, is keen to join the BJP, it is learnt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X