స్పోర్ట్స్ ఫెయిర్‌లో అపశ్రుతి... దుర్మరణం పాలైన స్టంట్ మ్యాన్...
పంజాబ్‌లో ట్రాక్టర్ విన్యాసాల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో తీవ్ర విషాదం నెలకొంది. విన్యాసాలు చేస్తున్న స్టంట్‌మ్యాన్ ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఇంజన్ కిందపడి మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
కంట్రోల్ కోల్పోయి..టైర్ల కింద పడ్డాడు...
పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో స్పోర్ట్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 29 ఏళ్ల సుఖ్‌మన్‌జీత్ సింగ్ అనే యువకుడు పాల్గొన్నాడు. టేట్ గ్రామానికి చెందిన సుఖ్ మన్ దీప్ సింగ్ ట్రాక్టర్ తో విన్యాసాలు చేయడంలో ఎంతో నేర్పరి. ఆయన చేసిన విన్యాసాలు గతంలో చాలాసార్లు పలు టీవీ చానెళ్లలో కూడా ప్రసారమయ్యాయి. సుఖ్ మన్ దీప్ భార్య పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఫతేగఢ్ ఛురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో నిర్వహిస్తున్న స్పోర్ట్ ఫెయిర్‌లో సుఖ్‌మన్‌దీప్ కూడా పాల్గొనేందుకు వచ్చాడు. అక్కడ తాను నడుపుతోన్న ట్రాక్టర్‌తో రకరకాల విన్యాసాలు ప్రదర్శించాడు.

పోటీల్లో భాగంగా ట్రాక్టర్ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు. ఆ వాహనం వెనక టైర్లతో, రౌండ్‌గా తిరగడం ప్రారంభించింది. ఈ సన్నివేశాన్ని చూసిన ప్రేక్షకులు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు. దీనిని అక్కడ ప్రేక్షకులు చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. ఈ క్రమంలో సుఖ్ మన్ ఓ టైర్ పై కాలు పెట్టి, డ్రైవర్ సీటులో కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆయన కంట్రోల్ కోల్పోయి వెనక టైర్ల కింద పడిపోయారు.
స్పోర్ట్స్ ఫెయిర్‌ను రద్దు చేశారు..
ఆ ఇంజిన్ మాత్రం అలా అతనిపై రౌండ్‌గా తిరుగుతూనే ఉంది. వెంటనే పక్కనే ఉన్న పలువురు అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయితే, వారు ట్రాక్టర్‌ను అదుపుచేయలేక భయంతో పరుగులు పెట్టారు. కొంత సమయం తరువాత అతడు ఇంజిన్ కింది నుంచి బయటకు వచ్చారు. భారీగా బరువు ఉండే ఇంజిన్ అతడిపై నుంచి వెళ్లడంతో అప్పటికే అతను తీవ్రగాయాలపాలయ్యాడు.
The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u
— Gagandeep Singh (@Gagan4344) October 29, 2023
అయితే, అక్కడవున్నవారు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత స్పోర్ట్స్ ఫెయిర్‌ను రద్దు చేశారు. ఈ సంఘటకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications