ఇండియాలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణమవుతున్న వ్యాధులు ఇవే..!
పుట్టడం ఒక అందమైన ప్రారంభం అయితే.. మరణం ఒక ప్రశాంతమైన ముగింపు. అలసిపోయిన మనిషి ప్రాణానికి కాలం ఇచ్చే విశ్రాంతి అంటే అది చావు అనే చెప్పాలి. అందుకే ప్రాణం అంటే నీటి బుడగ లాంటిది.. గాల్లో దీపం లాంటిది అంటూ పెద్దలు సామెతలు చెబుతూ ఉంటారు. అందుకే మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. చిన్నా, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎవరికి ఎప్పటి వరకు రాసి పెట్టి ఉంటే అంత వరకే జీవితం అని అంటుంటారు.
మారుతున్న కాలానుగుణంగా జనాభా పెరగడంతో పాటు మరోవైపు మరణాలు కూడా అదే సంఖ్యలో జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది సీజనల్, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో చాలా మరణాలు సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నివారించవచ్చు. అవగాహన లోపం, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయడం, జీవనశైలి సమస్యలు, చికిత్స ఆలస్యం వంటి కారణాలే ఈ మృత్యువులకు దారి తీస్తున్నాయి. దేశంలో ఎక్కువగా ప్రాణాలు తీస్తున్న వ్యాధులు ఇవే..

గుండె జబ్బులు (Heart Diseases)..
WHO గణాంకాల ప్రకారం, భారతదేశంలో మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులే. ప్రతి లక్ష మందిలో సగటున 110 మంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, పొగతాగడం, కొవ్వు అధికంగా ఉన్న ఆహారం, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారణాలు. ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం కావచ్చు. క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, జీవనశైలి మార్పులతో ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు (COPD, ఆస్థమా)..
భారతదేశంలో ప్రతి లక్ష మందిలో సుమారు 70 మంది శ్వాసకోశ వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. వాయు కాలుష్యం, వంట పొయ్యి పొగ, పరిశ్రమల ధూళి, పొగాకు వాడకం ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ప్రారంభ దశలో స్వల్ప లక్షణాలు ఉన్నా పట్టించుకోరు. ముందస్తు రోగ నిర్ధారణ, పొగతాగడం మానేయడం, సరైన చికిత్సతో జీవితాన్ని పొడిగించవచ్చు.
విరేచనాలు (Diarrhoeal Diseases)..
మురికి నీరు, పారిశుధ్య లోపం, పోషకాహార లోపం వల్ల విరేచన వ్యాధులు ఇప్పటికీ పెద్ద సమస్యగానే ఉన్నాయి. ప్రతి లక్ష మందిలో సుమారు 34 మంది ఈ వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బారిన పడుతున్నారు. ORS, పరిశుభ్రమైన నీరు, చేతుల పరిశుభ్రత వంటి సాధారణ చర్యలతో ఈ మరణాలను చాలా వరకు నివారించవచ్చు.
క్షయవ్యాధి (Tuberculosis - TB)..
టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధే అయినా, భారతదేశంలో ప్రతి లక్ష మందిలో సుమారు 25 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఆలస్యంగా రోగ నిర్ధారణ జరగడం, మందులను మధ్యలో ఆపేయడం, పోషకాహార లోపం ప్రధాన సమస్యలు. పూర్తి చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నివారించవచ్చు.
మధుమేహం (Diabetes)..
డయాబెటిస్ నేరుగా ప్రాణాంతకం కాకపోయినా, దాని వల్ల వచ్చే సమస్యలు చాలా ప్రమాదకరం. భారతదేశంలో ప్రతి లక్ష మందిలో సుమారు 23 మంది డయాబెటిస్ సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. నియంత్రణ లేని షుగర్ గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. క్రమం తప్పని పరీక్షలు, ఆహార నియంత్రణ, వ్యాయామం తప్పనిసరి.
క్యాన్సర్ (Cancer)..
భారతదేశంలో క్యాన్సర్ మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ, నోటి, పెద్దప్రేగు క్యాన్సర్లు అత్యంత ప్రమాదకరం. పొగాకు, మద్యపానం, కాలుష్యం, ఆలస్యమైన రోగ నిర్ధారణ ప్రధాన కారణాలు. రెగ్యులర్ స్క్రీనింగ్‌లు, ముందస్తు పరీక్షలు ప్రాణాలను కాపాడగలవు.
నవజాత శిశువుల సమస్యలు (Neonatal Causes)..
అకాల ప్రసవం, ఇన్ఫెక్షన్లు, ప్రసవ సమయంలో ఏర్పడే సమస్యలు నవజాత శిశువుల మరణాలకు ప్రధాన కారణాలు. గర్భధారణ సమయంలో సరైన వైద్య సంరక్షణ, సురక్షిత ప్రసవం, పుట్టిన తర్వాత శిశువుకు తగిన పర్యవేక్షణ కల్పిస్తే అనేక ప్రాణాలు కాపాడవచ్చు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications