ఎంతో ఊహించా కానీ,ఆశ్చర్యం: కేజ్రీవాల్‌పై అనుపమ్‌ఖేర్

ఒక్కమాటలో చెప్పాలంటే తాను ఎంతగానో ఊహించుకున్న ఎఎపి ఏకంగా లక్ష్యాన్నే కోల్పోయిందన్నారు. గత కొన్ని రోజులుగా తనను ఈ భావనలు తొలిచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఎపి లక్ష్యాలు, నెరవేర్చాల్సిన వాగ్ధానాలు ఒక్కసారిగా మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయగానే... మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పైన ఎలాంటి చర్యలు చేపడతారని ప్రశ్నించగా.. షీలా దీక్షిత్‌కు వ్యతిరేకంగా ముందు బిజెపి నేతలను రుజువులు తెమ్మనండని, రెండు గంటల్లో ఆమెపై చర్యలకు ఉపక్రమిస్తామని కేజ్రీవాల్ చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అనుపమ్ ఖేర్ ఓ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎఎపి తరఫున పోటీ చేయను
తాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం లేదని అనుపమ్ ఖేర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తున్నానా అని తెలుసుకునేందుకు ఓ నిర్మాత తనకు ఫోన్ చేశారని, తన సినిమా షూటింగ్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారని కానీ, తాను పోటీ చేయడం లేదని అనుపమ్ ఖేర్ తెలిపారు. తాను చిత్ర ప్రపంచంలో ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications