అబ్బే అదేం లేదు..!. మత్తుపదార్థాల వల్ల కాదు...! ఎంపీ నుస్రత్ జహాన్ ఆరోగ్యంపై క్లారిటీ

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటి నుస్రత్ జహన్ తీవ్ర అనారోగ్యం పాలైందని... అధికంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం ఆసుపత్రి పాలైందని వచ్చిన వార్తలను ఆమె కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. నుస్రత్ ఆరోగ్యం బాగానే ఉందని ఈరోజుల ఆసుపత్రి నుండి విడుదలైందని చెప్పారు.

నుస్రత్ జహాన్ .. గురించి తెలియని వారు ఉండరు. పశ్చిమబెంగాల్‌లో ప్రముఖ నటిగా ఉంటూ... 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైంది. నూతన ఎంపీగా ఎంపికైన తర్వాత పెళ్లి చేసుకుంది. అనంతర పలు వివాదాలకు కూడ కేంద్రబిందువు అయింది. దీంతో ఆమెకు పలు బెదిరింపులు కూడ వచ్చాయి. మరోవైపు ఫైర్ బాండ్ మమతా బెనర్జీ పార్టీ నుండి ఎంపికైన ఎంపీ కావడంతో అతి తక్కువ కాలంలోనే వెలుగులోకి వచ్చింది.

dismissing reports of drug overdose as rumours on MP Nusrat Jahan

అయితే ఆమెపై గత రెండు మూడు రోజులుగా రూమర్స్ వెలుగు చూశాయి. పార్లమెంట్ సమావేశాలకు కూడ ఆమె హజరు కాకపోవడంతో అవి మరింత ఊపందుకున్నాయి. నుస్రత్ జహాన్ అధికంగా మాదక ద్రవ్యాలు తీసుకంటుంందని, వాటి వల్ల అనారోగ్యం పాలైందని ప్రచారం జరిగింది. అందువల్లే పార్లమెంట్ సమావేశాలకు హజరు కాలేకపోయిందని ప్రచారం జరిగింది. దీంతో ఆమె ఆరోగ్యం పై కుటుంబసభ్యులు స్పందించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆసుపత్రి పాలు అయిందన్న వార్తలను కొట్టి పారేశారు. ఆమెకు ఇదివరకే శ్వాస సంబంధమైన వ్యాధితో ఇబ్బందిపడుతుందని, అయితే చలికాలం కావడంతో ఆదివారం అది మరింత ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిందని చెప్పారు. నేడు డిశ్చార్జ్ అయిందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+