నేను గాడిద జాతికి చెందినవాడను: ఆశారాం బాపు, చిరాకు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తనని తానే గాడిద అని చెప్పుకొన్నారు ఆశారాం బాపు. ఆయన అత్యాచారం కేసులో అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే.

కోర్టుకు ఆసారాం

కోర్టుకు ఆసారాం

ఇటీవల ఆశారాం ఓ నకిలీ సాధు అని అఖిల భారతీయ అఖాడ పరిషత్‌ విమర్శించింది. గురువారం ఆశారాంను విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకు వచ్చారు. ఈ సమయంలో మీడియా ఆయనను ప్రశ్నించింది.

నేను గాడిద జాతికి చెందినవాడినంటూ..

నేను గాడిద జాతికి చెందినవాడినంటూ..

'అఖాడా పరిషత్‌ ఆరోపణల ప్రకారం మీరు సాధువు కాదు, గురువు కాదు. మరి ఏ కేటగిరీకి చెందుతారు' అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆశారాం చిరాగ్గా స్పందించారు. నేను గాడిదల కేటగిరీకి చెందినవాడిని అంటూ చెప్పుకుండూ వెళ్లిపోయారు.

వీరే నకిలీ సాధువులంటూ

వీరే నకిలీ సాధువులంటూ

కాగా, తమను తాము దైవాంశ సంభూతులుగా ప్రకటించుకున్న పలువురు బాబాలు ఇటీవలికాలంలో వరుసగా వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్న నేపథ్యంలో నకిలీ బాబాల జాబితాను హిందూ సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ అఖాడా పరిషత్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

వీరిద్దరి పేర్లు కూడా

వీరిద్దరి పేర్లు కూడా

రాథేమా, అసిమానంద, ఓంబాబా తదితర 14 మంది దేవుడి పేరుతో హిందూ మతానికి మచ్చ తెస్తున్నారని అఖాడా పరిషత్ పేర్కొంది. అలహాబాద్‌లో ఆదివారం జరిగిన అఖాడా పరిషత్ సమావేశంలో 300మందికి పైగా సాధువులు పాల్గొన్నారు. ఈ జాబితాలో ఆసారాం బాపు, ఆయన తనయుడు నారాయణ స్వామిల పేర్లు కూడా ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Self-declared religious guru Aaaram Bapu has angrily described himself as a donkey after being denounced as neither a saint nor a preacher by an important association of Hindu saints.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X