Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శశికళ ఫ్యామిలీ లవ్ స్టోరీ: జయ చికిత్స వీడియో ఇస్తానన్నకుర్రాడి కథ !

శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ లవ్ స్టోరీ విషయంలో బంధువులు అడ్డుపడుతున్నారనే కోపంతో జయలలిత చికిత్స వీడియోలు బయపెడుతానని అతను బెదిరించడంతో చిన్నమ్మ ఫ్యామిలీలో ఇప్పుడు రచ్చ మొదలైయ్యింది.

చెన్నై: తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ప్రయత్నించి అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళ కుటుంబంలో ఇప్పుడు రచ్చ మొదలైయ్యింది. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన శశికళ కచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని మన్నార్ గుడి కుటుంబ సభ్యులు అనుకున్నారు.

అయితే సీన్ రివర్స్ అయ్యి ఆమె జైలుకు వెళ్లారు. శశికళ జైలుకు వెళ్లే ముందు తన సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ కు అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అప్పుడే శశికళ ఫ్యామిలీలో రచ్చ మొదలైయ్యింది.

కొండ మీద కుర్చున్న టీటీవీ

కొండ మీద కుర్చున్న టీటీవీ

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన కొండ మీద కుర్చోవడంతో శశికళ కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పటి నుంచి దినకరన్ పేరు ఎత్తితో శశికళ ఫ్యామిలీలోని ఓ వర్గం మండిపడేది.

శశికళ భర్తకే సినిమా చూపించాడు

శశికళ భర్తకే సినిమా చూపించాడు

పార్టీ పగ్గాలు చేతికి రావడంతో టీటీవీ దినకరన్ శశికళ భర్త నటరాజన్ కు సినిమా చూపించాడు. నటరాజన్ మాటలు లెక్కచెయ్యకుండా ఎదురుతిరగడం మొదలు పెట్టాడు. ఓ సందర్బంలో ఈ విషయం బహిరంగం అందరికీ తెలిసినా జైల్లో ఉన్న చిన్నమ్మ సూచనల మేరకు ఇరు వర్గాలు సర్దుకున్నాయి.

సీన్ లోకి దివాకరన్ ఫ్యామిలీ

సీన్ లోకి దివాకరన్ ఫ్యామిలీ

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పోటీ చెయ్యడానికి నామినేషన్ వెయ్యడంతో శశికళ సోదరుడు దివాకరన్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల నుంచి దినకరన్ ను తప్పించి ఎంజీఆర్ కుటుంబ సభ్యులతో పోటీ చేయించాలని బహిరంగంగా అన్నాడీఎంకే నాయకులను డిమాండ్ చేశారు.

దివాకరన్ కొడుకు జయానంద్ ఎంట్రీ

దివాకరన్ కొడుకు జయానంద్ ఎంట్రీ

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను, టీటీవీ దినకరన్ ను బహిష్కరిస్తున్నామని ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గం మీడియాకు చెప్పిన సమయంలో దివాకరన్ కుమారుడు జయానంద్ సీన్ లోకి ఎంట్రీ అయ్యాడు. ఈ పని ఎప్పుడో చేసి ఉంటే అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయేది కాదని, ఇప్పటికైన మంచి పని చేశారని దినకరన్ మీద ఉన్న కసిని సోషల్ మీడియా ద్వారా తీర్చుకున్నాడు.

బాంబు పేల్చిన జయానంద్

బాంబు పేల్చిన జయానంద్

జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె శశికళతో మాట్లాడుతున్న సందర్బంలో వీడియో తీశారని, ఆ వీడియో బయటపెడుతానని రెండు రోజుల క్రితం తన ఫేస్ బుక్ అకౌంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో బయటపెట్టేస్తానని పరోక్షంగా దినకరన్ వర్గాన్నిహెచ్చరించాడు.

అసలు కథ లవ్ స్టోరి

అసలు కథ లవ్ స్టోరి

టీటీవీ దినకరన్ కు సోదరుడు అయ్యే భాస్కరన్ కుమార్తె జయశ్రీ, శశికళ సొంత సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ ప్రేమించుకున్నారు. జయానంద్, జయశ్రీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే జయానంద్, జయశ్రీలు పెళ్లి చేసుకోవడం టీటీవీ దినకరన్ కు ఇష్టం లేదని సమాచారం. ఈ విషయంపై జయానంద్ టీటీవీ దినకరన్ మీద కోపం పెంచుకున్నాడని తెలిసింది.

పెళ్లి విషయంలో దివాకరన్ క్లారిటీ

పెళ్లి విషయంలో దివాకరన్ క్లారిటీ

తన కుమారుడు జయానంద్ కు ఇప్పుడు 24 ఏళ్లు అని, ఇప్పుడే పెళ్లి ఎందుకు అని భావిస్తున్నామని, రెండేళ్ల తరువాత నా కొడుకు పెళ్లి చేస్తానని దివాకరన్ ఆయన సన్నిహితుల దగ్గర చెప్పారని తెలిసింది. అయితే దినకరన్ చిక్కుల్లో పడిన సమయంలో వారి ఇంటితో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం ఇష్టంలేక దివాకరన్ ఇలా మాట్లాడుతున్నారని మన్నార్ గుడి కుటుంబ సభ్యులు గుసగుసలాడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+