Leader: అన్న కూతురి ఫ్యామిలీ గొడవలు, కోర్టులో విడాకుల కేసు, పొలిటికల్ లీడర్ ను నరికి చంపేసి !

బెంగళూరు: అధికార పార్టీకి చెందిన నాయకుడు స్థానికులకు ఏదైనా సమస్య వస్తే ముందు నిలబడి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. స్థానికంగా ఎవరికి సమస్యలు వచ్చినా ఆ అధికార పార్టీ నాయకుడి దగ్గరకు వెలుతున్నాడు. అధికార పార్టీ నాయకుడి అన్న కూతురికి వివాహం జరిగింది. అన్న కూతురి కుటుంబంలో సమ్యలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు, రాజీలు చేసినా వారి కాపురం మాత్రం చక్కబడలేదు. అన్న కూతురి సంసారం విషయం రచ్చరచ్చ అయ్యి కోర్టులో విడాకుల కేసు వరకు వెళ్లింది. అన్న కూతురికి న్యాయం చెయ్యాలని ఆ రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు. రాత్రి పని ముగించుకుని ఇంటికి వెలుతున్న రాజకీయ నాయకుడిని అన్న కూతురి భర్త, అతని స్నేహితులు దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

బీజేపీ లీడర్

బీజేపీ లీడర్

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని పావగడ తాలుకాలోని నాగలమడికే సమీపంలోని అప్పాజీ హళ్ళి ప్రాంతంలో ప్రసన్న కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి ప్రసన్న కుమార్ బీజేపీలో చురుకైన నాయకుడిగా ఆ పార్టీ పెద్దల దగ్గర గుర్తింపు తెచ్చుకున్నాడు.

 స్థానిక ప్రజలకు సమస్యలు వస్తే ?

స్థానిక ప్రజలకు సమస్యలు వస్తే ?

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన నాయకుడు ప్రసన్న కుమార్ స్థానికులకు ఏదైనా సమస్య వస్తే ముందు నిలబడి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. స్థానికంగా ఎవరికి సమస్యలు వచ్చినా అధికార పార్టీ నాయకుడు ప్రసన్న కుమార్ దగ్గరకు వెలుతున్నారు.

 అన్న కూతురి పెళ్లి వ్యవహారంతో ?

అన్న కూతురి పెళ్లి వ్యవహారంతో ?

ప్రసన్న కుమార్ అన్న కూతురికి పావగడకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆమె వివాహం జరిపించారు. ప్రసన్న కుమార్ అన్న కూతురి కాపురంలో సమ్యలు, గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు, రాజీలు చేసినా వారి కాపురం మాత్రం చక్కబడలేదు.

 పక్కాప్లాన్ తో చంపేశారు

పక్కాప్లాన్ తో చంపేశారు

ప్రసన్న కుమార్ అన్న కూతురి కాపురం విషయం రచ్చరచ్చ అయ్యి కోర్టులో విడాకుల కేసు వరకు వెళ్లింది. ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ప్రసన్న కుమార్ అతని అన్న కూతురికి న్యాయం చెయ్యాలని అనుకుంటున్నాడు. రాత్రి పని ముగించుకుని ఇంటికి వెలుతున్న ప్రసన్న కుమార్ ను అతని అన్న కూతురి భర్త, అతని స్నేహితులు దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

 రాజకీయంగా ఎదుర్కోలేమని ?

రాజకీయంగా ఎదుర్కోలేమని ?

ప్రసన్న కుమార్ హత్య కేసులో రవి, సుధీర్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రసన్న కుమార్ అన్న కూతురి భర్త మాత్రం తప్పించుకోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసన్న కుమార్ బతికుంటే రాజకీయంగా అతన్ని ఎదుర్కోలేమని, అతన్ని చంపేస్తే కోర్టులో వారి కుటుంబ సభ్యుల నుంచి విడాకుల కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చెయ్యడానికి అవకాశం ఉంటుందని అతని అన్న కూతురి భార్య స్కెచ్ వేశాడని ప్రసన్న కుమార్ స్నేహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+