EX wife: ఫస్ట్ భార్య జంప్, రెండో భార్యకు విడాకులు, నమ్మించి నరికి చంపేసిన మాజీ భర్త !
బెంగళూరు/మారతహళ్లి: భార్యాభర్తల మధ్య సంబంధం సక్రమంగా లేదని లేకపోతే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మైనర్ బిడ్డ భార్య వద్దే ఉండాలని కోర్టు ఆదేశించింది. భర్త అతని మాజీ భార్యను మాయ చేశాడు. మాజీ భార్యను మాయ చేసిన భర్త బెంగళూరులో ఇంటి అద్దె చెల్లించడం భారంగా మారుతోందని, కొంతకాలం ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ బిడ్డను చూసుకుందామని, తరువాత ఎవరి దారి వాళ్లు చేసుకుందామని భార్యను నమ్మించాడు. విడాకులు తీసుకున్న తరువాత కూడా ఎందుకు నీ భర్తతో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నావు అంటూ మహిళను ఆమె బంధువులు మందలించారు. త్వరలో వేరే ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న మహిళను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు.

ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి
బెంగళూరులోని వర్తూరులో మజీద్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం మోనిషా (30) అనే మహిళను మజీద్ పెళ్లి చేసుకున్నాడు. గతంలో వేరే మహిళను పెళ్లి చేసుకున్న మజీద్ అతని భార్యతో నిత్యం గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత మజీద్ మోనీషాను రెండో పెళ్లి చేసుకున్నాడు.

రెండో భార్యతో గొడవలు
మజీద్, మోనీషా దంపతులకు చిన్న బిడ్డ ఉంది. బిడ్డ పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి, మోనీషా కుటుంబ సభ్యులు ఇప్పటికే చాలాసార్లు మజీద్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే మొదటి భార్య వెళ్లిపోయిందని, ఇప్పుడు రెండో భార్య మోనీషా కూడా వెళ్లిపోతే నీకు ఇంక ఎవ్వరు పిల్లను ఇవ్వరని. పద్దతి మార్చుకోవాలని మజీద్ కు అతని బంధువులు బుద్దిమాటలు చెప్పారు.

15 రోజుల క్రితం విడాకులు
ఎవరు ఎన్ని చెప్పినా మజీద్, మోనీషా దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక లాభం లేదని మజీద్, మోనీషా దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన తరువాత కూడా మోనీషా, మజీద్ దంపతుల మధ్య రాజీ చెయ్యాలని కొందరు ప్రయత్నించారు 15 రోజుల క్రితం మజీద్, మోనీషా దంపతుల విడాకులు తీసుకున్నారు. బిడ్డ మోనీషా దగ్గర ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కిలాడీ స్కెచ్ వేసిన భర్త
విడాకులు తీసుకున్న తరువాత వర్తూరులోని ఒకే ఇంటిలో మోనీషా, మజీద్ దంపతులు ఉన్నారు. బెంగళూరులో ఇంటి అద్దె చెల్లించడం భారంగా మారుతోందని, కొంతకాలం ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ బిడ్డను చూసుకుందామని, తరువాత ఎవరి దారి వాళ్లు చేసుకుందామని మాజీ భార్య మోనీషాను మజీద్ నమ్మించాడు. ఇంతకాలం జీవించిన భర్త మజీద్ తో కొంతకాలం ఉంటే ఏం పోతుందని మోనీషా అనుకుంది.

పక్కాప్లాన్ తో భార్యను చంపేసి ఎస్కేప్
త్వరలో వేరే ఇంటికి వెళ్లిపోదామని మోనీషా అనుకుంటున్నది. మూడు రోజుల క్రితం మాజీ భార్య మోనీషాను ఆమె మాజీ భర్త మజీద్ దారుణంగా హత్య చేసి బిడ్డను ఎత్తుకుని ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు. మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు తాళం పగలగొట్టి చూడగా ఇంట్లో మోనీషా శవమై కనిపించింది, మోనీషా మూడు రోజుల క్రితమే హత్యకు గురైయ్యిందని, మజీద్ కోసం గాలిస్తున్నామని వర్తూరు పోలీసులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications