'మోడీకి అల్లుడు, సోనియాకు కోడలు': రమ్య వర్సెస్ తేజిందర్ (వీడియోలు)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ రమ్య అలియాస్ దివ్య స్పందన, బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గాల మధ్య ఆసక్తికరమైన ట్విట్టర్ పోరు కొనసాగింది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీపై రమ్య ఓ ట్వీట్ చేయగా, తేజిందర్ కౌంటర్‌గా మరో వీడియో పోస్ట్ చేశారు.
ఇది చర్చనీయంశంగా మారింది. ఇతర పార్టీలపై బురద జల్లే క్రమంలో ఇలాంటి వీడియోలు పెట్టడంపై విమర్శలు కూడా వస్తున్నాయి.

నటి రాఖీ సావంత్ న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నారు. ఆమె ఓ వీడియో పోస్ట్ చేస్తూ తనకు ఓ భర్త దొరికాడని, పక్కనే ఉన్న అతనిని చూపిస్తూ.. అందరూ తన భర్త ఎవరు అని అడుగుతున్నారని, ఇతనేనంటూ పేర్కొంది. అతనితో కలసి న్యూయార్క్‌లో తిరుగుతున్నానని, ఈ వీడియోను ప్రధాని మోడీ సహా అందరూ చూస్తుంటారంటూ.. మోడీని ఉద్దేశించి.. 'ఇలా చూడండి.. ఇతనే మీ అల్లుడు' అని పేర్కొంది. దీనిని రమ్య రీపోస్ట్ చేసి మోడీకి తన అల్లుడు దొరికాడని పేర్కొన్నారు.
“मोदी जी आपका दामाद मिल गया है” @narendramodi @rakhisawant7 pic.twitter.com/RhSRLSxpIR
— Divya Spandana/Ramya (@divyaspandana) July 9, 2018
దీనికి తేజ్‌పాల్ కౌంటర్‌గా మరో వీడియో పోస్ట్ చేశారు. సోనియా గాంధీకి ఓ కోడలు దొరికిందని చెబుతూ.. అలహాబాద్‌కు చెందిన ఓ మహిళ చేసిన ఆరోపణల వీడియోను పోస్ట్ చేశారు.
“सोनिया जी आपकी बहु मिल गई है” @RahulGandhi pic.twitter.com/DDKhmrm9RY
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) July 9, 2018
రాహుల్ గాంధీ తన భర్త అని, అతను తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారని, రోజు కలలోకి వస్తున్నారని, కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని, తనను పెళ్లి చేసుకొని ఓబీసీలపై ఉన్న ప్రేమ చూపించాలని ఆమె వీడియోలో కోరింది.












Click it and Unblock the Notifications