దీపావళి ఆఫర్: రూ. 1కే షర్ట్, రూ. 10కే నైటీ, జనం బారులు

చెన్నై: పండగలు వచ్చాయంటే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడం సాధారణ విషయమే. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు పోటీ పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తారు. డిస్కౌంట్ల అంటూ వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.

భారీ ఆఫర్‌తో జనం బారులు

భారీ ఆఫర్‌తో జనం బారులు

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ వస్త్ర దుకాణం ఈ దీపావళి పండగను పురస్కరించుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. దీంతో జనం ఆ షాపు వైపు బారులు తీరారు. పెద్ధ సంఖ్యలో జనం రావడంతో వారికి క్యూలైన్లు పెట్టింది ఆ షాపు యాజమాన్యం.

రూపాయికే షర్ట్.. రూ. 10కే..

రూపాయికే షర్ట్.. రూ. 10కే..

కేవలం రూపాయికే షర్ట్ లేదా టీ షర్ట్, రూ. 10కి నైటీ విక్రయించడంతో కొనుగోలుదారులు భారీగా బారులు తీరారు. ఈ ఆఫర్ ఒక్క రోజే కాకుండా వారం రోజులపాటు కొనసాగించడం గమనార్హం. పండగ సమయంలో పేదలకు తక్కువ ధరకే బట్టలు విక్రయించాలని నిర్ణయించుకున్నామని, అందుకే ఈ ఆఫర్ అందిస్తున్నామని చాకలిపేట టెక్స్ షోరూం యజమాని ఆనంద్ చెప్పుకొచ్చారు.

దీపావళి పండగ..

దీపావళి పండగ..

దీపావళి పండగను పురస్కరించుకుని అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 26 వరకు ఆఫర్ అమ్మకాలు కొనసాగించడం గమనార్హం. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రూపాయికే షర్ట్ లేదా టీ షర్ట్, రూ. 10కే నైటీ విక్రయాలు జరిపినట్లు షాపు యజమాని తెలిపారు.

పేదలకు ఖరీదైన వస్త్రాలు

పేదలకు ఖరీదైన వస్త్రాలు

మొదట 50 మందికి మాత్రమే ఈ ఆఫర్ అమలు చేయగా.. రద్దీ భారీగా పెరగడంతో 200మందికి టోకెన్లు ఇచ్చారు. మరికొంత మందికి కూడా ఈ వస్త్రాలను అందించారు. పేద ప్రజలు కూడా ఖరీదైన వస్త్రాలు ధరించి దీపావళి జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ఇచ్చినట్లు ఆనంద్ తెలిపారు. ఉచితంగా దానికి విలువ ఉండదని, నామమాత్రపు ధరకు ఇలా విక్రయాలు జరిపినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+