DK Shivakumar: 'ఆర్ఎస్ఎస్ గీతం' వివాదం.. డీకే శివకుమార్ క్షమాపణలు

DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన డీకే శివకుమార్ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడటంపై తలెత్తిన వివాదంపై క్షమాపణ చెప్పారు. బీజేపీని ఆటపట్టించడానికే తాను అలా చేశానని, ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ఈ ఘటన వల్ల కాంగ్రెస్ పార్టీలో గానీ, ఇండియా కూటమిలో గానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని బెంగళూరులో మీడియా సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.

"నేను బీజేపీని ఆటపట్టించడానికి అలా చేశాను. నా స్నేహితుల్లో కొందరు దీన్ని రాజకీయం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం లేదు. ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షమాపణ కోరుకుంటున్నాను," అని డీకే శివకుమార్ అన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదిగానే ఉంటానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. "నేను వారందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. గాంధీ కుటుంబాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. నేను పుట్టుకతో కాంగ్రెస్‌వాదిని. కాంగ్రెస్‌వాదిగానే చనిపోతాను.నాకు వివిధ పార్టీల్లో చాలా మంది స్నేహితులు, అనుచరులు ఉన్నారు. నేను ఎవరినీ బాధ పెట్టాలని అనుకోవడం లేదు." అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.

DK Shivakumar Apologizes Over RSS Song Row Sparks Debate Within Congress

గత వారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై ప్రతిపక్ష బీజేపీ చర్చను లేవనెత్తగా.. డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతమైన 'నమస్తే సదా వత్సలే మాతృభూమే' లోని కొన్ని పంక్తులను ఆలపించారు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బి.కె. హరిప్రసాద్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడినందుకు డీకే శివకుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'స్వతంత్ర భారతదేశంలో మూడుసార్లు నిషేధించబడిన సంస్థ గీతాన్ని పాడటం ద్వారా శివకుమార్ ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నారు?' అని హరిప్రసాద్ ప్రశ్నించారు. అయితే, మరో మంత్రి హెచ్.సి. మహాదేవప్ప, ఆర్ఎస్ఎస్ గీతం పాడినంత మాత్రాన డీకే శివకుమార్ బీజేపీలో చేరినట్లు కాదని అన్నారు. "ఆయన తాను కూడా ఒక హిందువునని మాత్రమే చెప్పారు. కాంగ్రెస్ ఆ సిద్ధాంతానికి (ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి) వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుంది. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని సమర్థించేవారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తారు" అని మహాదేవప్ప తెలిపారు.

చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడారు. అయితే, దీనిపై కాంగ్రెస్ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొంతవరకు సద్దుమణిచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+