DK Shivakumar: డీకే శివకుమార్ సత్సంప్రదాయం

కర్ణాటక రాజకీయాల్లో నేటితో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్రంలో అధికార బదిలీ ప్రక్రియను కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది. నేడు బెంగళూరులో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 13 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు లోక్ భవన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

కొత్త కేబినెట్ కూర్పులో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించినట్టు కనిపిస్తోంది. ప్రాంతీయ, సామాజిక సమీకరణలను సమన్వయం చేసే టీమ్ ను రూపొందించడమే దీని ఉద్దేశం. జీ పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఆయనకు ప్రమోషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలతో ఇద్దరు నాయకులు విస్తృతంగా చర్చించారు. కొత్త కేబినెట్ నిర్మాణం, అధికార సమతుల్యత, సంస్థాగత సమీకరణలను ఖరారు చేశారు.

DK Shivakumar meets former PM HD Deve Gowda and Ex CM Yediyurappa in the Ahead of oath-taking

డీకే శివకుమార్ సొంత నియోజకవర్గం కనకపుర. ఆయన సామాజిక వర్గం ఒక్కలిగ. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో.. డాక్టర్ జీ పరమేశ్వర (కొరటగెరె- దళిత), కేహెచ్ మునియప్ప (దేవనహళ్ళి- దళిత), కేజే జార్జ్ (సర్వజ్ఞ నగర్- క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (బబలేశ్వర్- లింగాయత్), రామలింగా రెడ్డి (బీటీఎం లేఅవుట్- రెడ్ది ఒక్కలిగ), సతీష్ జారకిహోళి (యమకనమరడి- వాల్మీకి), కృష్ణ బైరేగౌడ (బ్యాటరాయనపుర- వొక్కలిగ), ప్రియాంక్ ఖర్గే (చిత్తాపూర్- దళిత), యూటీ ఖాదర్ (మంగళూరు- ముస్లిం), ఈశ్వర్ ఖండ్రే (భాల్కీ- లింగాయత్), యతీంద్ర సిద్ధరామయ్య (ఎమ్మెల్సీ- కురుబ), బైరతి సురేష్ (హెబ్బాళ- కురుబ), శరణ్ ప్రకాష్ పాటిల్ (సేడం- లింగాయత్) ఉన్నారు.

కాగా- ప్రమాణ స్వీకారం నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ ఉదయం వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. రాష్ట్రాన్ని నడిపించడంలో సహకరించాలని కోరారు.మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) చీఫ్ హెచ్ డీ దేవేగౌడ నివాసానికి వెళ్లారు. శాలువ కప్పి సన్మానించారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అలాగే.. మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప ఇంటికీ వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+