కర్ణాటక సీఎం పదవిపై డీకే శివకుమార్ ఏమన్నారంటే?
బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించినట్లు తానెప్పుడు చెప్పలేదని అన్నారు.
జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఎవరూ అసంతృప్తితో లేరని స్పష్టంచేశారు. తామంతా కలిసే ఉన్నామని వివరించారు.
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో ఆనందంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని తాను ఆశించినట్లు ఎప్పుడూ చెప్పలేదని, ప్రస్తుతం అంతా సవ్యంగా ఉందని శివకుమార్ తెలిపారు.

కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు రసవత్తరంగా మారిన సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు గురికాకుండా చూడటమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఇద్దరు ఎమ్మెల్యేలను తిరిగి సభకు హాజరుపరచడంలో శివకుమార్ విజయవంతమయ్యారు. బీజేపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించి తమపార్టీ ఎమ్మెల్యేలతోపాటు జేడీఎస్ ఎమ్మెల్యేలను పార్టీ వీడకుండా కాపాడగలిగారు.












Click it and Unblock the Notifications