రూటు మారుస్తున్న డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకులతో ఫోటోలు, ద్వేషరాజకీయాలకు ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అంటే శాంతికి చిహ్నం అని తెలిసిందే. ఇతర రాష్ట్రాల ప్రజలు లక్షలాది మంది కర్ణాటకలో జీవనం సాగిస్తున్నారు. లక్షలాది మంది తమకు పోటీ వస్తున్నా ఏమాత్రం పట్టించుకోని కన్నడిగులు ఎవరిపాటికి వాళ్లు వాళ్ల పనులు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో కూడా ప్రత్యర్థ పార్టీ నాయకుల మీద రాజకీయంగా ద్వేషం ఉంటుందేమో కాని ప్రతీకార హత్యలు జరగడం చాలా తక్కువే అని చెప్పాలి.
కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు అన్నిఇన్నికావు. ముఖ్యంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. డీకే శివకుమార్ ను ఓడించాలని బీజేపీలోని మహామహులు అనేక ప్రయత్నాలు చేశారు.

అయితే డీకే శివకుమార్ కనకపుర నియోజక వర్గంలో వరుసగా 8వ సారి 1 లక్షా 20 వేలకు పైగా ఓట్లు సంపాధించి భారీ విజయంతో ఎమ్మెల్యే అయ్యారు. డీకే శివకుమార్ ఎమ్మెల్యేగా ఓడిపోతాడు అని పదేపదే చెప్పిన బీజేపీ నాయకులు అదే డీకేశీ ఉప ముఖ్యమంత్రి కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత డీకే శివకుమార్ రూటు మార్చారు.
ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత హోదా పెంచుకున్న డీకే శివకుమార్ ప్రతిపక్ష నాయకులతో కలిసి ఉండాలని డిసైడ్ అయినట్లు ఉన్నారని తెలుస్తోంది. బెంగళూరులోని పద్మనాభనగర్ లో నివాసం ఉంటున్న జేడీఎస్ పార్టీ దళపతి, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఇంటికి వెళ్లిన డీకే శివకుమార్ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.

మాజీ ప్రధాని దేవేగౌడ ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్ ఆయనతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి కొంతసేపు ముచ్చటించారు. విధానసౌధలో డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు. తన మీద కనకపుర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఆర్. అశోక్ ను నవ్వుతూ పలకరించారు.
పక్కనే మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఉండటంతో ఆయనతో పాటు అశోక్ తో చాలా సేపు మాట్లాడిన డీకే శివకుమార్ వారితో నవ్వుతూ ఫోటోలు తీసుకున్నారు. ఇక ఆర్. అశోక్ భుజం మీద చెయ్యి వేసి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా డీకే శివకుమార్ ఫోటోలు తీసుకున్నారు. ఆర్. అశోక్, డీకే శివకుమార్, మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కలిసి విధానసౌధలో తీసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
ద్వేష రాజకీయాలు పక్కన పెట్టి అందరితో కలిసిమెలసి పని చెయ్యాలని డీకే శివకుమార్ డిసైడ్ అయ్యారని తెలిసింది. డీకే శివకుమార్ చాలా రఫ్ అండ్ టఫ్ లీడర్ అనే విషయం ప్రచారంలో ఉంది. అయితే ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత డీకే శివకుమార్ ఆయన స్టైల్ మారుస్తున్నారని, ద్వేష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారని డీకేశీ సన్నిహితులు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications