సెక్స్ స్యాండల్ కేసు ఎంపీ జర్మనీకి జంప్ ?, సీడీ లేడీ ఆత్మహత్యాయత్నం?, డీసీఎం తమ్ముడు !

హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ పెన్ డ్రైవ్ కేసు కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టించింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ పెన్ డ్రైవ్ కేసు హాట్ టాపిక్ అయ్యింది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ కేసును విచారించేందుకు కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో వీడియోలో ఉన్న మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

దీంతో బెంగళూరు గ్రామీణ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముద్దుల తమ్ముడు డీకే సురేశ్‌ సిద్దరామయ్య ప్రభుత్వానికి ఓ లేఖ రాయడం రాజకీయాలను కుదిపేసింది. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి కుటుంబాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ మనవి చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ వీడియోలో ఉన్న యువతికి న్యాయం చెయ్యాలని సిద్దరామయ్య ప్రభుత్వానికి డీకే సురేష్ మనవి చేశారు.

DK Suresh demands protection for woman in JDS MP Prajwal Revanna s sex sandal CD

హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ కుటుంబానికి చెందిన వారని, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నత పదవుల్లో ఉన్నారని, ఆ కుటుంబంపై రాజకీయ ప్రభావం ఉన్నందున వేధింపులకు గురైన మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు హాని జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు గురైన మహిళకు, ఆమె కుటుంబానికి ప్రజ్వల్ రేవణ్ణ ఫ్యామిలీ నుంచి అన్యాయం జరగకుండా చూడటానికి వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ మనవి చేశారు.

DK Suresh demands protection for woman in JDS MP Prajwal Revanna s sex sandal CD

కాబట్టి కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించి బాధితురాలితో పాటు ఆ కుటుంబ సభ్యులు అందరికీ తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నానని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ట్వీట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ పెన్ డ్రైవ్ వీడియోలో ఉన్న బాధితురాలు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. పెన్ డ్రైవ్‌లోని అశ్లీల వీడియో విపరీతంగా షేర్ అవుతున్నాయని, ఇవి బాధిత కుటుంబంపైనా ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతోందని డీకే సురేష్ ఆరోపించారు.

దీనిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సెక్స్ స్యాండల్ పెన్ డ్రైవ్ వీడియోను బహిరంగంగా లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి వెళ్లిపోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు వస్తుండటంతో ఇప్పటికే ఆయన దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారని కొందరు అంటున్నారు. పెన్ డ్రైవ్ వీడియో లీక్ అయిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లినట్లు సమాచారం. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే కర్ణాటకలో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+