అన్నయ్యకు నీడలా నిలబడుతున్న తమ్ముడు, ప్రతిపక్షాలకు సవాలుగా మారిన డీకే బ్రదర్స్ !
బెంగళూరు/రామనగర్: కర్ణాటక రాజకీయాల్లో డీకే. బ్రదర్స్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. డీకే. శివకుమార్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తమ్ముడు డీకే. సురేష్ ఎంపీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే అన్నకు ఏ కష్టం వచ్చినా అందరికంటే ముందు ఉండే తమ్ముడిగా డీకే. సురేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అక్రమాస్తుల కేసు విచారణలో, అన్న కేపీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత ఎంత బిజీగా ఉన్నా ఆయన నియోజక వర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం కనకపుర నియోజక వర్గంలోనే ఉండేవాడు. కేపీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న డీకే. శివకుమార్ కు ఆయన సోదరుడు డీకే. సురేష్ అన్ని విధాలుగా అండగా ఉండేవాడు.

సీబీఐ దాడులు, ఈడీ దాడుల సమయంలో అన్న డీకే శివకుమార్ కు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఢిల్లీ కేసుల విచారణ సమయంలో, బెంగూరులో అధికారులు విచారణ చేస్తున్న సమయంలో డీకే. శివకుమార్ వెంట డీకే. సురేష్ ఉన్నారు. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరైన సమయంలో కూడా ఆమె వెంట డీకే. సురేష్ వెళ్లారు.
డీకే. శివకుమార్ కు సంబంధించిన ప్రతికష్టసుఖాల్లో ఆయన వెంట కాంగ్రెస్ ఎంపీ, డీకే సోదరుడు డీకే. సురేష్ వెంటే ఉండేవారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరు నగర శివార్లలోని బిడిది రిసార్టులో పెట్టి ఆ ఎమ్మెల్యేలు జారిపోకుండా వాళ్లకు ఏ టూ జడ్ చూసుకోవడంలో డీకే. సురేష్ కీలకపాత్ర పోషించారు. డీకే శివకుమార్ కు సంబంధించిన ప్రతి విషయంలో ఆయన సోదరుడు డీకే. సురేష్ ఆయన వెంటే ఉంటూ అన్నకు తగ్గ తమ్ముడిలా అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications