విజయ్ కాంత్‌కు ఏమైంది, యోగా (వీడియో)
చెన్నై: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆయా రాష్ట్రాలలోని రాజకీయ నాయకులు, సినీ నటులు తదితరులు యోగా చేశారు. తమిళ నటుడు, డీఎండీకే చీఫ్ ‘కెప్టెన్'విజయ్ కాంత్ యోగా చేసి అందరిని ఆకట్టుకోవడానికి తంటాలు పడ్డారు.
డీఎండీకే ఆధ్వర్యంలో చెన్నైలో యెగా డే నిర్వహించారు. డీఎండీకే శాసన సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యోగా డేలో పాల్గోన్నారు. అయితే యోగా గురువు చెప్పిన యోగాసనాలు వేయడానికి విజయ్ కాంత్ నానా తంటాలు పడ్డారు.
చివరికి విజయ్ కాంత్ యోగాసనాలు వెయ్యడంలో పూర్తిగా తికమకపడ్డారు. అనంతరం విజయ్ కాంత్ యోగ గురించి స్పీచ్ ఇచ్చారు. తాను నిత్యం 108 యోగాసనాలు వేస్తానని, అందుకే 62 సంవత్సరాలు అయినా తాను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్పారు. అయితే విజయ్ కాంత్ చేసిన యోగా క్లిప్పింగ్ లు చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవ్వరి తరం కాదని అర్థమైపోతూ ఉంది.












Click it and Unblock the Notifications