చెంప ఛెళ్లుమనిపిస్తా: విజయకాంత్ మరో వివాదం
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై డీఎండీకె అధినేత, నటుడు విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం చల్లారకముందే ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు.
2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం సేలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ సమయంలో పూర్తిగా సహనం కోల్పోయిన విజయ్ కాంత్ పాత్రికేయులపై ఆవేశంతో ఊగిపోయారు. చెంప చెళ్లుమనిస్తానంటూ పాత్రికేయులను హెచ్చరించారు.
అయితే ఆయన జర్నలిస్టులపై విరుకుచుపడటం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా డిఎండీకె, పీడబ్ల్యూఎఫ్ కూటమికి ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా బరిలో ఉన్న విజయకాంత్ ఉల్లుందూర్ పేట్ నుంచి పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications