విజయ్‌కాంత్ ఆరోగ్యంపై పుకార్లు నమ్మొద్దు: డీఎండీకే
చెన్నై: ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఆ పార్టీ ఖండించింది. విజయ్‌కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని.. పుకార్లను నమ్మొద్దంటూ పార్టీ ప్రధానకార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
విజయ్‌కాంత్ అనారోగ్యానికి గురయ్యారంటూ, ఆస్పత్రిలో చేరారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో డీఎండీకే స్పందించింది. అవన్నీ కేవలం పుకార్లేనని డీఎండీకే స్పష్టం చేసింది.

వరద బాధితులను కలిసేందుకు ఆయన చెన్నై, కడలూరు, కాంచీపురం, తిరువల్లూరు ప్రాంతాలకు వెళ్లారని.. విశ్రాంతి తీసుకోకుండా పర్యటించడంతో కొంచెం అలసిపోయారని పార్టీ వెల్లడించింది.
ఆ సమయంలోనే ఆయన కాస్త జ్వరంతో బాధపడ్డారని.. ప్రస్తుతం విజయ్‌కాంత్ క్షేమంగా ఉన్నారని డీఎండీకే తెలిపింది.












Click it and Unblock the Notifications