సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే !
డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చాకచక్యంగా పావులుకదుపుతున్నారు. శశికళ వర్గాన్ని అడ్డుకోవడానికి పన్నీర్ కు బయటి నుంచి డీఎంకే .
చెన్నై: తమిళనాడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే సమావేశం కావాలని బుధవారం ఆదేశించారు. బుధవారం మద్నాహ్నం డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని సూచించారు.
తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సమయంలో ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అంటూ డీఎంకే నాయకుడు స్టాలిన్ ఆ పార్టీ శాసన సభ్యులతో చర్చించడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రధాన ప్రతిపక్షం.

అన్నాడీఎంకే పార్టీలోని శాసన సభ్యులు, ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోవడం తెలిసిందే. తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ మీద తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎడప్పాటి పళనిసామి తమిళనాడు సీఎం అభ్యర్థిగా తెర మీదకు వచ్చారు.
అయితే పన్నీర్ సెల్వంకు ఊహించనంత ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో స్టాలిన్ డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చెయ్యడం సంచలనం రేపింది. గతంలో పలుసార్లు పన్నీర్ సెల్వం పనితీరును స్టాలిన్ మెచ్చుకున్న విషయం తెలిసిందే.
శశికళ వర్గాన్ని అడ్డుకోవడానికి పన్నీర్ సెల్వంకు బయటి నుంచి డీఎంకే పార్టీ మద్దతు ఇస్తుందా ? లేక రెబల్ ఎమ్మెల్యేల సహకారంతో డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందా ? అనే విషయం అంతుపట్టడం లేదు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీ కోర్టు దోషిగా ప్రకటించిన తరువాత స్టాలిన్ చాకచక్యంగా పావులుకదుపుతున్నారు.












Click it and Unblock the Notifications