స్థానిక సమరంలో డీఎంకే జయభేరి ! చెన్నైలో క్లీన్ స్వీప్ !! అన్నాడీఎంకే కోటలకు భీటలు

తమిళనాడు స్థానిక పోరులో అధికార డీఎంకే జయభేరి మోగించింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా కొనసాగుతోంది. అన్నాడీఎంకే పార్టీ కంచుకోటలను డీఎంకే బద్దలు కొట్టింది. మేజర్ స్థానాల్ని కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టించింది..

 చెన్నైలో క్విన్ స్వీప్

చెన్నైలో క్విన్ స్వీప్


పట్టణ స్థానిక సంస్థల పోరులో డీఎంకే విజయకేతనం ఎగురవేసింది. చెన్నై కార్పొరేషన్ లో క్విన్ స్వీప్ చేసింది. ఇక్కడ మొత్తం 200 వార్డులకు గాను 192 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు 146 చోట్ల డిఎంకే అభ్యర్ధులు విజయ సాధించారు . అన్నాడీఎంకే కేవలం 15 వార్డులకే పరిమితమైంది. కాంగ్రెస్ మూడు వార్డుల్లో గెలుపొందింది. అటు కోయంబత్తూరులో 75 శాతానికి పైగా స్థానాలను డీఎంకే కైవసం చేసుకుంది.

 స్థానిక పోరులో డీఎంకే విజయకేతనం

స్థానిక పోరులో డీఎంకే విజయకేతనం

అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులో కూడా అధికార డీఎంకే హవా కొనసాగింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మొత్తం 1374 వార్డులకు ఎన్నికలు జరగగా వాటిలో 425 స్థానాల్లో డీఎంకే విజయకేతనం ఎగరవేసింది. అన్నాడీఎంకే 75 చోట్ల మాత్రమే గెలుపొందింది. మున్సిపాల్టీల్లోని 3843 వార్డులకు గాను 1832 చోట్ల డీఎంకే గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే 494 స్థానాలకే పరిమితమైంది. అటు 7621 పట్టణ పంచాయతీలకు గాను 4261 చోట్ల సీఎం స్టాలిన్ పార్టీ డీఎంకే విజయం సాధించింది. అన్నాడీఎంకే 1178 చోట్ల గెలుచుకుంది.

 డీఎంకేకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్‌

డీఎంకేకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్‌

స్థానిక పోరులో డీఎంకే ఘన విజయం సాధించడంతో ఆపార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే భారీ స్థానాల్ని కైవసం చేసుకోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తొమ్మిది నెలల పరిపాలనకు ఈ విజయం ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్‌గా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రజలు తమ పట్ల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+