• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పన్నీరు ప్రశ్నలకు జవాబేదీ?: శశికళకు స్టాలిన్ సవాల్, హెచ్చరిక

|

చెన్నై: తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుగుబాటు వెనక డీఎంకే ఉందని ఆరోపణలు చేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే పన్నీరు సెల్వం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని శశికళకు స్టాలిన్ తన ప్రకటనలో సవాల్ విసిరారు.

శశికళకు అనుకోని షాక్: 43మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్, పన్నీరు క్యాంపుకే

ప్రతిపక్ష నేతతో కలిసి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నవ్వారని, వారిద్దరికీ సంబంధాలున్నాయని శశికళ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అత్యంత వేగంగా సీఎం కాలేకపోయాననే దిగులుతో కృంగిపోయిన శశికల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎద్దేవా చేశారు.

DMK leader Stalin warns Sasikala

గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన పన్నీరు సెల్వంను పోయెస్ గార్డెన్ పిలిపించి, రెండు గంటలపాటు బెదిరించి రాజీనామా చేయించిన శశికళ.. అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

శశికళకు నిజంగా దమ్ముంటే పన్నీరు సెల్వం చేసిన విమర్శలకు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్ననీరు సెల్వం నాయకత్వంలో సాఫీగా సాగుతున్న ప్రభుత్వాన్ని కూలదోస్తూ ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించిన ఘటనపై సీబీఐ విచారణ జరపాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

English summary
DMK leader Stalin has hits out at AIADMK General Secretary Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X