నిలకడగా కరుణానిధి ఆరోగ్యం : 23న డిశ్చార్జ్ అన్న స్టాలిన్
డీఎంకే అధినేత కరుణానిధి(92) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి(92) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యతో కరుణానిధి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
ఈనెల 15న ఆసుపత్రిలో చేరిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారని, మరో రెండు మూడు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్లు వారు తెలిపారు.

మరోవైపు కావేరి ఆసుపత్రికి ప్రముఖుల తాకిడి అధికమైంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని పరామర్శించేందుకు మంగళవారం సీపీఐ నేత డి.రాజా, పీఎంకే చీఫ్ రాందాస్, హాస్యనటుడు వివేక్, సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సహా ;పలువురు ప్రముఖులు కావేరి ఆసుపత్రికి వెళ్ళారు.
పరామర్శ అనంతరం వారు ఆయన కుమారుడు స్టాలిన్ సహా పలువురు డీఎంకే నేతలను కలిసి కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి కృతజ్ఞతలు తెలిపిన స్టాలిన్ కరుణానిధి 23న
డిశ్చార్జ్ అవనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications