జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని సోదరుడితో కలిసి కనిమొళి ఆందోళన

జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ డిఎంకె రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఆ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కనిమొళిలు చెన్నై కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసనలో పాల్గొన్నారు.

చెన్నై : జల్లి కట్టుపై నిషేధం ఎత్తివేయాలనే అంశంపై తమిళనాడులో డిఎంకె నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ అంశాన్ని రాజకీయంగా ప్రచార అస్త్రంగా ఆ పార్టీ మలుచుకొనే ప్రయత్నం చేస్తోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య ఈ అంశం మాటల యుద్దానికి తెరతీసింది.

జల్లికట్టుకు తమిళనాడులో చాలా చరిత్రఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సందర్భంగా ఈ ఆటను ఆడేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతుంటారు. ఈ ఆటలో విజయంసాధించిన పురుషులను పెళ్ళిచేసుకొనేందుకు యువతులు ఆసక్తిని చూపుతారు.

జల్లికట్టుపై 2014 లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ క్రీడపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ద్రవిడ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్రంలో ఉన్న పార్టీపై ఒత్తిడి తెస్తున్నాయి.

జల్లికట్టుపై నిషేధం అంశాన్ని మరోసారి లేవనెత్తుతున్నాయి ద్రవిడ పార్టీలు . ముఖ్యంగా డిఎంకె ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తోంది.

డిఎంకె నిరసనలు

డిఎంకె నిరసనలు

జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డిఎంకె శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టింది. జల్లి కట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దరిమిలా డిఎంకె ఈ మేరకు నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమాల ద్వారా అన్నాడిఎంకెకు రాజకీయంగా ఇరుకునపెట్టేందుకు డిఎంకె ప్రయత్నిస్తోంది.

నిరసనర్యాలీలో కనిమొళి

నిరసనర్యాలీలో కనిమొళి

జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ డిఎంకె రాష్ట్ర వ్యాప్గంగా నిరసన కార్యక్రమాలను పిలుపునిచ్చింది. దరిమిలా చెన్నై కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ తో పాటు ఆ పార్టీ నాయకురాలు కనిమొళి కూడ పాల్గొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ బాద్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన కార్యక్రమాల్లో కనిమొళి పాల్గొనడం ఇదే తొలిసారి. తన సోదరుడు అళగిరి, కనమొళి వర్గాలను కూడ కలుపుకొని స్లాలిన్ వెళ్తున్నాడు.అయితే కనిమొళి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో వీరిద్దరి మద్య ఎలాంటి పొరపొచ్చాలు లేవనే సంకేతాలను క్యాడర్ కు ఇచ్చారు.

ప్రభుత్వంపై ఒత్తిడి కోసం డిఎంకె వ్యూహం

ప్రభుత్వంపై ఒత్తిడి కోసం డిఎంకె వ్యూహం

జల్లికట్టు పై నిషేధం అంశాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకుగాను డిఎంకె ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జల్లికట్టును నిర్వహించుకోవడం తమిళనాడులో సంప్రదాయంగా వస్తోంది. ఈ అంశాన్ని అవకాశంగా తీసుకొని స్టాలిన్ నిరసనలకు దిగాడు.మరో వైపు ఈ అంశం ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కల్గిస్తోంది.ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని కూడ కేంద్రాన్ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరాడు. కాని, ఈ విషయమై కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు.

అన్నాడిఎంకె కూడ పోటాపోటీ యత్నాలు

అన్నాడిఎంకె కూడ పోటాపోటీ యత్నాలు

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేత అంశంపై డిఎంకె దూకుడుగా వెళ్ళడాన్ని అన్నాడిఎంకె సీరియస్ గా తీసుకొంది. ఈ అంశం రాజకీయంగా తమకు ఇబ్బంది కల్గించేఅవకాశం ఉందని భావించిన ఆ పార్టీ డిఎంకెతో పోటాపోటీగా కార్యక్రమాలను తీసుకొంటుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధానమంత్రికి లేఖ రాశారు. అన్నాడిఎంకె ఎంపిలు కేంద్ర పర్యావరణశాఖ మంత్రిని కలిసి జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేలా చూడాలని కోరారు. మరో వైపు ఆ పార్టికి చెందిన ఎంపిలు ప్రధానమంత్రిని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+