Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegitimate affair: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి: సారీ చెప్పిన ప్రతిపక్ష పార్టీ నేత

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఎన్నికల ప్రచార తీవ్రత పెరుగోతంది. అధికార ఏఐఎడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హద్దు, అదుపు లేకుండా ఘాటు పదాలు జాలువారుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఏ రాజా..ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని బాధించాయి. రోడ్ షోలో ఆయన కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ అనూహ్య పరిణామంతో ఏ రాజా తన తప్పును తెలుసుకున్నారు. క్షమాపణ చెప్పారు.

ముఖ్యమంత్రి ఎడప్పాడి తల్లిని కించపరిచేలా ఏ రాజా వ్యాఖ్యలు చేశారు. చెన్నై చెపాక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏ రాజా.. ప‌ళ‌నిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధం కాని జంటకు పళనిస్వామి జన్మించారంటూ ఘాటు పదజాలాన్ని ప్రయోగించారు. పైగా ఆయన ప్రీ మెచ్యుర్డ్ బేబీగా పుట్టారని విమర్శించారు. పళనిస్వామి వ్యక్తిత్వం.. డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పులకు కూడా పనికి రాదంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నాయకులు మండిపడ్డారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏ రాజాపై కేసు నమోదు చేశారు.

 DMKs A Raja apologises for his remark against CM Palaniswami

ఇవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పళనిస్వామి కన్నీరు పెట్టుకున్నారు. చెన్నై తిరువొత్తియూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన.. రాజా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తనపైనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మరణించిన తన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం డీఎంకే నేతల అసహనాన్ని సూచిస్తోందంటూ విమర్శించారు. దేవుడే వారికి సరైన శిక్ష విధిస్తారని చెప్పారు. పళనిస్వామి కన్నీరు పెట్టుకోవడం పట్ల ఏ రాజా స్పందించారు. ఆయనను బాధపెట్టడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రికి క్షమాపణ కోరుతున్నానని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+