సీఎం కుమారుడికి డీసీఎం పగ్గాలు ?, ఇప్పటికే ఆయన మంత్రి, పార్టీలో జోరుగా చర్చ

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను త్వరలో ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో డీఎంకే పార్టీలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ అన్నా ఇన్‌స్టిట్యూట్‌లో కీలక అధికారులతో సంప్రదింపులు జరపనున్నారు. దీని తర్వాత సీఎం ఎంకే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని అంటున్నారు.

ఈ విషయంపై తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం సింపుల్ గా సమాధానం ఇచ్చారు. ఉదయానిధి స్టాలిన్ సమాధానంతో డీఎంకే పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. చాలా కాలం నుంచి తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై చాలా మంది మంత్రులు బహిరంగంగా మాట్లాడుతున్నారు.

DMK sources say that Udayanidhi Stalin will be appointed as Deputy Chief Minister of Tamil Nadu

జిల్లా స్థాయిలో జరిగిన డీఎంకే పార్టీ సమావేశాల్లో కూడా ఉదయనిధి స్టాలిన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఎప్పటికప్పుడు తీర్మానాలు చేయడంతో ఈ విషయమై చర్చలు ఊపందుకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎక్కడికి వెళ్లినా ఇదే విషయంపై మీడియా ప్రశ్నలు వేస్తోంది. ముఖ్యంగా మంగళవారం జరిగిన డీఎంకే పార్టీ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై చర్చలు జరిగాయి.

కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎస్.పళణి మాణిక్యం మాట్లాడుతూ ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయ్యకూడదా? అని పార్టీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి చెయ్యడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, వేదికపై ఉన్న మీకు, నేతలకు మధ్య ఇంకా తడబాటు ఎందుకు? అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కేంద్ర మాజీ మంత్రి పళణి మాణిక్యం ప్రశ్నించారు.

DMK sources say that Udayanidhi Stalin will be appointed as Deputy Chief Minister of Tamil Nadu
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటన సందర్భంగా ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని డీఎంకే నాయకులు, కార్యకర్తలు అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈరోజు యూనివర్సిటీలో కీలక అధికారులతో సంప్రదింపులు జరుపనున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.

ఈ సంప్రదింపుల అనంతరం ఉదయనిధి స్టాలిన్ ను ఉప ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటిస్తారని డీఎంకే పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందుకోసం యూనివర్శిటీని బాణాసంచాతో హోరెత్తించారు. బుధవారం తమిళనాడు మంత్రి ఉదయనిధిని మీరు ఉప ముఖ్యమంత్రి అవుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. తాను ఉప ముఖ్యమంత్రి అయ్యే విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని, సీఎంతో మంత్రుు అందరూ చర్చించిన తరువాత వాళ్లే నిర్ణయం తీసుకుంటారని, ఆ విషయం గురించి తాను ఎక్కువ మాట్లాడను అని ఉదయానిధి స్టాలిన్ చాల సింపుల్ గా సమాదానం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+