డీఎంకే నేత దాష్టీకం: మహిళను ఇష్టానుసారంగా తన్నాడు(వీడియో)

చెన్నై: తమిళనాడులో డీఎంకే నాయకుడు ఒకడు మహిళపై ఇష్టానుసారంగా కాళ్లతో తన్నుతూ దాడి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ మారింది. దీంతో నెటిజన్లు, ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అతడ్ని డీఎంకే అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. పెరంబలూరు జిల్లాలో డీఎంకే మాజీ కార్పొరేటర్ సెల్వకుమార్.. బ్యూటీ సెలూన్‌లోని ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడ పనిచేసే ఇతర మహిళలు అడ్డుకున్నా.. ఆగకుండా ఆమెను పలుమార్లు కాలితో తన్నాడు.

ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డమైంది. గత మే 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, సదరు మాజీ కార్పొరేటర్ ఆ మహిళకు రూ. 5లక్షలు అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

DMK Suspends Leader Seen On Video Kicking Woman In Beauty Parlour

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+