నిరహరదీక్షకు స్టాలిన్, మెరీనా బీచ్ వేదికగా నిరసన, ఎందుకంటే?
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 22వ, తేదిన నిరహారదీక్షలకు డిఎంకె పిలుపునిచ్చింది. పార్టీ నాయకులతో కలిసి మెరీనా బీచ్ లో స్టాలిన్ దీక్ష చేపట్టనున్నారు.
చెన్నై:తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 22వ, తేదిన నిరహారదీక్షలకు డిఎంకె పిలుపునిచ్చింది. పార్టీ నాయకులతో కలిసి మెరీనా బీచ్ లో స్టాలిన్ దీక్ష చేపట్టనున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ఈ నెల 22 వ, తేది నుండి నిరసన కార్యక్రమాలకు డిఎంకె పిలుపునిచ్చింది.తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో స్టాలిన్ ఆందోళన చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

శనివారం నాడు తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం నాడు పార్టీ ఎంఏల్ఏలు, నాయకులతో స్టాలిన్ సమావేశమయ్యారు.శాంతియుతంగానే ఈ నెల 22వ, తేదిన నిరహారదీక్షను నిర్వహించనున్నట్టు డిఎంకె పార్టీ నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మెరీనా బీచ్ లో స్టాలిన్ నిరహార దీక్ష నిర్వహిస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పారు.
శాంతి భద్రతలకు భంగం కల్గించారంటూ స్టాలిన్ పై ఎప్ ఐ ఆర్ నమోదు చేశారు. తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలోనే అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులు, ఎంఏల్ఏలతో చర్చించిన తర్వాత ఆ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకొంది.












Click it and Unblock the Notifications