చెన్నైలో ఉద్రిక్త పరిస్థితి: స్టాలిన్ మద్దతు, తలపట్టున్న పన్నీర్ !

చెన్నైలో ఉద్రిక్త పరిస్థితి: స్టాలిన్ మద్దతు, తలపట్టున్న పన్నీర్ !

చెన్నై: తమిళనాడులో జల్లికట్టు సాహస క్రీడకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోజురోజుకు ఆందోళలను ఎక్కువ అవుతున్నాయి. జల్లకట్టు నిర్వహించడానికి ప్రయత్నించిన వారిని అరెస్టు చేశారని, పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే విడుదల చెయ్యాలని మంగళవారం కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

మంగళవారం ఉదయం నుంచి చెన్నై నగరంలోని మెరీనా బీచ్ లో 8 గంటల పాటు వేలాది మంది కాలేజ్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మధురైలో జల్లికట్టుకు మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేశారని, వెంటనే వారిని విడుదల చెయ్యాలని విద్యార్థులు తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

DMK working president M.K. Stalin wrote a letter to wish students and youths, who support to Jallikattu.

జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విద్యార్థులు రోడ్ల మీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆందోళనకు దిగడంతో చెన్నై నగరంతో సహ తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జల్లికట్టు నిర్వహించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ సంపూర్ణ మద్దతు తెలిపారు. డీఎంకే పార్టీ మద్దతు ఇవ్వడంతో వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+