డీఎంకే- కాంగ్రెస్ సీట్లు సర్దుబాటు.. హస్తం పార్టీకి 28 సీట్లు..

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార డీఎంకే- కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లను కేటాయించింది అధికార డీఎంకే పార్టీ. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సెల్వపెరుంతగై మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ మేరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 28 చోట్ల పోటీ చేయనుంది. 2021 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అదనంగా మూడు సీట్లు లభించాయి. అలాగే ఒక రాజ్యసభ సీటును కూడా కాంగ్రెస్ కు కేటాయించింది అధికార డీఎంకే పార్టీ.

తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే- కాంగ్రెస్ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 28 సీట్లు కేటాయించింది డీఎంకే పార్టీ. ఈ మేరకు సీట్ల కేటాయింపుపై తమకు సంతృప్తికరంగా ఉన్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సెల్వపెరుంతగై తెలిపారు.

అయితే ఈసారి డీఎంకే- కాంగ్రెస్ పొత్తులో కొన్ని బేధాలు వచ్చాయి. పొత్తు ఉండదని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం.. పార్టీ హై కమాండ్ తరఫున రంగంలోకి దిగి ముఖ్యమంత్రి స్టాలిన్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దాంతో చర్చలు ఫలించి పొత్తుపై క్లారిటీ వచ్చింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు డీఎంకే పార్టీ కాంగ్రెస్ కు కేవలం 25 స్థానాలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈసారి 28 స్థానాలు అంటే అదనంగా మరో మూడు స్థానాలను హస్తం పార్టీకి కేటాయించింది.

DMKCongress Seat Sharing Finalized for TN Polls Congress Gets 28 Seats in Major Alliance Deal

ఇక ఈ సారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. అధికారాన్ని కాపాడుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది. తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు దళపతి విజయ్ టీవీకే పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అటు ఏఐఏడీఎంకే- ఎన్డీఏ కూటమి ఈ సారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అటు తాజాగా చిన్నమ్మ శశికళ కూడా నూతన పార్టీ పెట్టారు. దాంతో ఈ సారి ఎన్నికల్లో హోరాహోరీ తప్పేలా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+