ఎన్టీఆర్ పేరుపై హోరెత్తిన రాజ్యసభ, ప్లకార్లులు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సబ్యులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంశంపై రగడ చేసారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలన్న అంశంపై చర్చించాలని ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కోరారు.
ఆ అంశంపై ముందుగా నోటీసు ఇవ్వాలని చైర్మన్ సూచించారు. కానీ కాంగ్రెస్ ఎంపీలు అప్పటికప్పుడే చర్చ జరపాలని పట్టుపట్టారు. ఆ మొత్తం సమయం అంతా ఎంఏ ఖాన్, వీ హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం ప్లకార్డులు ప్రదర్శించారు. నోటీసు లేకుండా చర్చకు అనుమతించడం సాధ్యం కాదంటూ చైర్మన్ సభను వాయిదా వేసారు.
12 గంటలకు సభ మళ్ళీ మొదలైన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు అదే అంశంపై రగడ సృష్టించారు. నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్ళి నినాదాలు చేశారు. దాంతో సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాయిదా వేసారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యురాలు విజయలక్ష్మి సాధో కూడా జత కూడారు.

ఎన్టీఆర్ పేరుపై
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెసు రాజ్యసభ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

ఎన్టీఆర్ పేరుపై..
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తక్షణమే చర్చకు అనుమతించాలని కాంగ్రెసు సభ్యులు రాజ్యసభలో డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ పేరుపై..
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెసు సభ్యులు మంగళవారం రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శించారు.

ఎన్టీఆర్ పేరుపై..
సభ్యులు నోటీసు ఇస్తేనే సభలో చర్చకు అనుమతించడానికి వీలుంటుందని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తేల్చి చెప్పారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications