మన దేశంలో అక్రమ సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్న నగరం ఏదో తెలుసా..?
దాంపత్య జీవితం లో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తుంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి.
పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. ఇంకా ఏయే కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం. భారతదేశంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారతీయ నగరాల్లో వివాహేతర సంబంధాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్‌ఫాం 'గ్లీడెన్' తాజా అధ్యయనంలో వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు నగరం ఈ జాబితాలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
గ్లీడెన్ యాప్‌లో నమోదు చేసుకున్న మొత్తం వినియోగదారులలో 20 శాతం మంది ఒక్క బెంగళూరు నగరానికే చెందిన వారున్నారు. బెంగళూరు తర్వాత స్థానాల్లో ముంబయి (19%), కోల్‌కతా (18%), ఢిల్లీ (15%), పూణె (10%) ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో దేశవ్యాప్తంగా మూడు మిలియన్లకు పైగా వినియోగదారులు చురుకుగా ఉన్నారు.ఈ అధ్యయనం ప్రకారం, ముఖ్యంగా ఐటీ, వైద్య రంగాల్లో పనిచేసే వృత్తి నిపుణులే ఇలాంటి సంబంధాలను ఎక్కువగా ఏర్పరచుకుంటున్నారు.
వివాహేతర సంబంధాలకు గల కారణాలను కూడా గ్లీడెన్ నివేదిక స్పష్టం చేసింది.సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 58 శాతం మంది భావోద్వేగ అనుబంధం కోసం ఈ సంబంధాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.33 శాతం మంది పని-జీవితం సంతులనం లోపించడం ప్రధాన కారణంగా పేర్కొన్నారు.సామాజిక విశ్లేషకులు ఈ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆధునిక ఒత్తిడులు, వ్యక్తిగత స్వేచ్ఛ కారణంగా కుటుంబ బంధాల మధ్య సమతుల్యత దెబ్బతింటున్నదని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ జాబితాలో మరో ఐటీ హబ్ అయిన హైదరాబాద్ నగరం టాప్ 5 లో లేకపోవడం నగరవాసులకు, సాంప్రదాయ విలువలకు కాస్త ఊరటనిచ్చే అంశం. బెంగళూరులో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఈ ధోరణి పట్టణ జీవితంలో కొత్త సవాళ్లను సూచిస్తోంది.












Click it and Unblock the Notifications