వైన్ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పటిలోగా తాగాలో తెలుసా?
గతంలో మద్యం పేరు చెప్పగానే అందరూ దూరంగా పరిగెత్తేవారు. మద్యాన్ని సేవించడం ఆరోగ్యానికి హానికరమని, అది ఒక చెడ్డ అలవాటని అందరూ భావించేవారు. అలాగే మద్యం తాగేవారిని కూడా సమాజం దూరంగా పెట్టేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. మద్యం సేవించడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. పెళ్లిచూపుల్లో పెళ్లికొడుకుకు మద్యం సేవించే అలవాటు లేదని చెబితే అమ్మాయితోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. చివరికి అటువంటి స్థితికి మన సమాజం చేరుకుంది.
పదే పదే మద్యం షాపులకు వెళ్లడం ఇష్టంలేనివారు ఒకేసారి పెద్ద పెద్ద సీసాలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. సీసాను తెరిచిన తర్వాత ఎప్పటిలోగా దాన్ని పూర్తిగా తాగేయాలన్నది అవగాహన ఉండటంలేదు. దీనివల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. సీసాను తెరిచిన తర్వాత దాన్ని చిన్న చిన్న పెగ్గుల్లెక్కన తాగుతుంటారు. సీసా తెరవగానే అందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. అలా.. అలా.. అది వెనిగర్ అవుతుంది.

అందుకే పెద్ద పెద్ద సీసాలను తెచ్చుకొని నిల్వ చేసుకునేవారు మూత తెరిచిన తర్వాత మూడు రోజుల నుంచి వారం రోజుల్లోపు తాగేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా యువత బీర్ ను ఎక్కువగా ఇష్టపడుతుందనే విషయం తెలిసిందే. దీని ఎక్స్ పెయిరీ డేట్ కంటే ఇదే ముందుగా ముగుస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి బీరు సీసా తెరిచిన తర్వాత ఒకరోజులోనే తాగేయాలి. అలా కాకుండా కొన్నిరోజులపాటు నిల్వ ఉంచితే ఆక్సిజన్ తో చర్యలు జరిపి వాసనతోపాటు రుచి కూడా మారుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు చిన్న చిన్న సీసాలు తెచ్చుకోవాలని, తక్కువ తక్కువతోనే తాగేసి వాటిని పారవేయాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications