2025 సంవత్సరం చివరగా ఏ దేశంలో అడుగుపెడుతుందో తెలుసా..?
నూతన సంవత్సరం అంటే కేవలం ఒక కొత్త తేదీ మాత్రమే కాదు. అది గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో ముందుకు సాగేందుకు మనకు ఒక అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ సంప్రదాయాలతో, విధానాలతో ఈ రోజును జరుపుకుంటారు.మన దేశంలో కూడా యూత్ నూతన సంవత్సర వేడుకలకు రెడీ అవుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాలు వేర్వేరు కాలమండలాల్లో ఉన్నాయి కనుక, న్యూ ఇయర్ వేడుకలు కూడా వేర్వేరు సమయాల్లో జరుగుతాయి.
అయితే, న్యూ ఇయర్ వేడుకలను మొదటగా, చివరిగా ప్రారంభించే దేశాల గురించి తెలుసుకునే ప్రయత్నాం చేద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కిరిబాటి ద్వీప దేశం ప్రపంచంలోనే మొదట న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటుంది. దీనికి కారణం ఈ దేశం అంతర్జాతీయ తేదీ రేఖకు అతి సమీపంలో ఉండటం. కిరిబాటి తర్వాత సమోవా ద్వీపం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటుంది. ఈ దేశం కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది.దక్షిణ పసిఫిక్ ద్వీప టోంగా దేశం కూడా న్యూ ఇయర్ వేడుకలను మొదటగా జరుపుకునే దేశాలలో ఒకటి.

ఈ దేశాలు అంతర్జాతీయ తేదీ రేఖకు అతి సమీపంలో ఉండటం వల్ల, ఇక్కడ కొత్త రోజు మొదట వస్తుంది.అమెరికాలోని బేకర్, హోవార్డ్ దీవులు కొత్త సంవత్సరాన్ని చివరగా స్వాగతించే ప్రాంతాలు.భారతదేశం తర్వాత ఐదున్నర గంటలకు యూకేలో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునే విధానం వేర్వేరుగా ఉంటుంది. కొన్ని దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తే, మరికొన్ని దేశాలు తమ స్వంత క్యాలెండర్‌ను అనుసరిస్తాయి.












Click it and Unblock the Notifications