అంబులెన్స్ అలస్యం: డాక్టర్ కు వీరబాదుడు (వీడియో)
లక్నో: అంబులెన్స్ రావడం అలస్యం అయ్యిందని ఆరోపిస్తూ డాక్టర్ ను పట్టుకుని చితకబాదిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. తీవ్రగాయాలైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ రోగి ఇంటి దగ్గరకు వెల్లడానికి ఆలస్యం అయ్యింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఓ వైద్యుడు ఎమర్జెన్సీ వార్డులో రోగులకు చికిత్స చేస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా వచ్చిందని మండిపడిన ఆ రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గరకు వెళ్లారు.

ఎమర్జెన్సీ వార్డులో ఉన్న డాక్టర్ ను ఆసుపత్రి మెయిన్ గేట్ దగ్గరకు లాక్కొని వెళ్లారు. అక్కడ అందరూ చూస్తున్న సమయంలో ఆ డాక్టర్ ను వీరబాదుడు బాదేశారు. డాక్టర్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా వారు అవకాశం ఇవ్వలేదు.
డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరు మంది యువకుల మీద కేసు నమోదు చేశారు. డాక్టర్ కు చికిత్స అందించామని కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో పదేపదే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications