attack:డాక్టర్, పోలీసుపై దాడి, పరీక్షించేందుకు వస్తే రైతు ఫ్యామిలీ నో, అనుమానితుడు పరార్..
ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను క్షమించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసిన కొందరిలో మార్పు రావడం లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ కఠినచర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసినా.. గంటల వ్యవధిలోని ఓ వైద్యుడు, పోలీసు అధికారిపై రైతు, అతని కుమారుడు కలిసి దాడి చేశారు. అతని మరో కుమారుడికి పరీక్ష చేసేందుకు వెళ్తే అడ్డుకోవడమే గాక.. దాడి చేశారు. మధ్యప్రదేశ్ షియెపూర్ జిల్లా గాస్వానీ జిల్లాలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.

వైద్యుడిపై దాడి..
గాస్వానీకి చెందిన గంగారం రైతు. ఇతనికి గోపాల్, ఆశిష్ అనే కుమారులు ఉన్నారు. గోపాల్ ఇటీవల గున జిల్లాకు వెళ్లొచ్చాడు. విజయార్ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు పవన్ ఉపాధ్యాయ్ విషయం తెలుసుకున్నాడు. అక్కడ వైరస్ తీవ్రత ఉండటంతో.. గోపాల్‌ను పరీక్షిద్దామనుకొని ఇంటికి వెళ్లాడు. అలా ఇంటికి వెళ్లడంతో వారి నుంచి ప్రతిఘటన ఎదురైంది.

పరీక్షించేందుకు నో..
గోపాల్‌ను పరీక్షించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరారు. కానీ అతనికి వైరస్ ఉందేమో అనుకొని ఏఎస్సై శ్రీరామ్‌ను తీసుకొని డాక్టర్ పవన్ ఉపాధ్యాయ్ వచ్చాడు. మాటలతో చెబితే వినిపించుకోరా.. అని వారి దాడి చేశారు. గంగారం, ఆశిష్ కలిసి వారిపై దాడి చేశారు. దీంతో డాక్టర్‌కు స్వల్ప గాయం కాగా.. పోలీసు అధికారి తలకు గాయాలయ్యాయి. తర్వాత గంగారం, ఆశిష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ సంపత్ మాత్రం అక్కడినుంచి తప్పించుకొని పోయాడు.
Recommended Video

ఐదో ఘటన
వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టంచేసిన కొద్ది గంటల్లోనే ఘటన జరగడం విశేషం. ఇదేకాదు ఇదివరకు కూడా వైద్య సిబ్బందిపై దాడులు జరిగాయి. డాక్టర్, పోలీసులతోపాటు, పారిశుద్ద్య సిబ్బందిపై నాలుగుసార్లు దాడులు జరిగాయి. బుధవారం జరిగిన దాడి ఐదోది అని అధికారులు చెబుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications