మద్యం మత్తు: రోగుల పట్ల అసభ్య ప్రవర్తన, డాక్టర్ అరెస్ట్

నిందిత వైద్యుడు తారీఖ్ ఇక్బాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వికలాంగులైన మైనర్ బాలికలను, ఓ వివాహిత అయిన రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. తమతో వైద్యుడు తారీఖ్ అసభ్యంగా ప్రవర్తించాడని, తమ శరీర భాగాలను తాకాడని బాధితులు ఆరోపించారు.
డాక్టర్ ఇక్బాల్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. కాలేజీ యాజమాన్యం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్బాల్ మద్యం సేవించే విధులకు హాజరవుతాడని వారు తెలిపారు.
సోమవారం మద్యం మత్తులో విధులకు హాజరైన వైద్యుడు మహిళా, మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఎస్పి ఏకె జైన్ తెలిపారు.












Click it and Unblock the Notifications