పార్కింగ్ కార్లకు నిప్పు: వీడిన మిస్టరీ, డాక్టర్ అమిత్ గైక్వాడ్ అరెస్ట్
బెంగుళూరు: ఇళ్ళ ముందు పార్కింగ్ చేసిన కార్లకు రాత్రి పూట నిప్పు పెడుతున్న డాక్టర్‌ను కర్ణాటక పోలీసులు ఎట్టకేలకు పట్టుకొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి, బెళగావి ప్రాంతంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన కార్లను నిప్పు పెడుతూ భయబ్రాంతులకు గురి చేసిన డాక్టర్ అమిత్ గైక్వాడ్‌ను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.
కలబురిగికి చెందిన అమిత్ గైక్వాడ్ బెళగావిలోని బిమ్స్ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అమిత్ కొద్దిరోజులుగా కలబురిగి, బెళగావిలో ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్లకు రాత్రి వేళల్లో నిప్పు పెట్టడం అలవాటుగా మారింది.

మూడు రోజుల క్రితం కూడా బెళగావిలో ఏపీఎంసీ లే అవుట్‌లోని ఎనిమిది కార్లకు గైక్వాడ్ నిప్పు పెట్టాడు. అంతకు ముందు కలబురిగిలో ఏడు కార్లను దహనం చేశాడు. బుధవారం రాత్రి కూడా బెళగావి సదాశివనరగ్‌లో కారుకు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు గైక్వాడ్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అమిత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... అతడి వద్ద నుంచి నిప్పు పెట్టడానికి వినియోగిస్తున్న కర్పూరం, పాత బట్టలు, పెట్రోల్, కత్తుల స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనాలకు నిందితుడు ఎందుకు నిప్పుడు పెడుతున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications