Bottle Guard: వృద్ధుడి కడుపులో 16 అంగుళాల సోరకాయ.. !
కడుపులోంచి కత్తెర బయటకు తీసిన సంఘటనలు చూసి ఉంటారు.. కడుపులోంచి వెంట్రుకాలు బయటకు తీసిన వీడియోలు చూసి ఉంటారు. కడపులోంచి కీ చైన్లు తీసిన ఘటనలు చూసి ఉంటారు. కడుపులోంచి గడ్డలు బయటకు తీసిన సంఘటనలు చూసి ఉంటారు. కానీ కడుపు నుంచి సోరకాయ తీసిన ఘటన ఇంతకు ముందు ఎప్పుడైన విన్నారా.. అవును తాజాగా ఓ మనిషి కడుపులోంచి 16 అంగుళాల సోరకాయను బయటకు తీశారు. ఆపరేషన్ చేసి పురీషనాళం (పెద్ద పేగులో మలం చివరగా నిల్వ ఉండే ప్రదేశం) నుంచి సొరకాయ బయటకు తీసినట్లు వార్తలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో వైద్యులు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి శస్త్రచికిత్స చేసి 60 ఏళ్ల వృద్ధుడి పురీషనాళంలో ఉన్న 16 అంగుళాల సొరకాయను బయటకు తీసినట్లు కథనాలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోరకాయ మనిషి లోపలి నుంచి ఎలా బయటకు తీశారు. అస్సలు అతని లోపలికి సోరకాయ ఎలా వెళ్లిందని చర్చించుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో 60 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు వృద్ధుడికి పలు పరీక్షలు చేశారు. అయితే ఎక్స్-రే లో ఎదో ఉన్నట్లు గమనించారు. పురీషనాళంలో ఆకుపచ్చ రంగులో సొరకాయ మాదిరిగా ఎక్స్ రే కనిపించింది. మొదట్లో అది గడ్డ కావొచ్చని భావించారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. వైద్యులు సంజయ్ మౌర్య, నంద కిషోర్, మనోజ్ చౌదరి ఆపరేషన్ చేశాడు.
దాదాపు రెండు 2 గంటల పాటు శ్రమించి వృద్ధుడి పురీష నాళంలో ఉన్న 16 అంగుళాల సొరకాయను బయటకు తీసినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. వృద్ధుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే సొరకాయ పురీష నాళం వరకూ ఎలా వెళ్లి ఉండొచ్చని వైద్యులు ఆలోచిస్తున్నారు. వృద్ధుడి మానసిక పరిస్థితి బాగోలేక సోరకాయ మింగి ఉంటాడని భావిస్తున్నారు. అస్సలు సోరకాయ ఎలా మింగాడు. కడుపులోంచి తీసింది నిజంగా సోరకాయేనా అని అనుమాన పడుతున్నారు.












Click it and Unblock the Notifications